`ముంబై మిర్రర్` కు రానా పంచ్ అదిరింది

Update: 2020-03-06 16:38 GMT
రూమర్స్, గాసిప్స్....సినీ తారలకు, సెలబ్రిటీలకు కొత్తేమీ కాదు. టాలీవుడ్, బాలీవుడ్ తారలలో చాలామంది ఈ పుకార్లకు, గాలి వార్తలకు అలవాటు పడి ఉంటారు. కాబట్టి, కొందరు తమ స్వార్థం కోసం క్రియేట్ చేసే బేస్ లెస్ ఫేక్ న్యూస్ లకు పెద్దగా స్పందించరు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇటువంటి పుకార్లు షికార్లు చేయడం వల్ల నటీనటుల పేరు ప్రఖ్యాతలు దెబ్బతినే అవకాశముంది. అందుకే, కొన్ని సందర్భాల్లో ఈ తరహా పుకార్లపై ఘాటుగా స్పందించాల్సిన అవసరముంటుంది. తాజాగా టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా కూడా తనపై వచ్చిన ఓ కథనంపై ఘాటుగా స్పందించాడు. తన గురించి అవాకులు చవాకులు పేలే ముందు తనను, లేదా తన పీఆర్ ను సంప్రదించాలని సదరు పత్రికకు చురకలంటించాడు.

ముంబై మిర్రర్ లో వచ్చిన రానాతో పాటు మరికొందరు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలపై ఓ ఆర్టికల్ వచ్చింది. అనిర్బన్ బ్లాహ్ అనే వ్యాపారవేత్త కొంత కాలం క్రితం లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడట. బ్లాహ్ తమను వేధించాడని నలుగురు మహిళలు ఆరోపించారట.దీంతో, అతడిని ఆ సంస్థ నుంచి తొలగించారట. అయితే, ముంబైలోని చైనీస్ రెస్టారెంట్ లో బ్లాహ్ ఇచ్చిన విందుకు రానా కూడా హాజరయ్యాడని ఆ ఆర్టికల్ లో రాశారు. ఈ ఆర్టికల్ క్లిప్ ను ఓ ట్విటర్ యూజర్ షేర్ చేస్తూ....రానాను విమర్శించాడు. బ్లాహ్ వంటి కామాంధులను రానా వంటి సెలబ్రిటీలు ఎంకరేజ్ చేయడం సిగ్గుచేటంటూ చేసిన ట్వీట్ రానాకు ఆగ్రహం తెప్పించింది. తాను ఏ సమయంలో ఎక్కడ ఉన్నానో...ఏం చేస్తున్నానో తెలుసుకొని మరీ పత్రికల్లో రాయాలంటూ ముంబై మిర్రర్ కు రానా చురకలంటించాడు. తన నంబర్ ముంబై మిర్రర్ ప్రతినిధుల దగ్గర ఉందని, తనకు ఫోన్ చేయవచ్చని...లేదంటే తన పీఆర్ టీంను సంప్రదించడం చాలా సులువని రానా అన్నాడు. ఇకపై ముంబై మిర్రర్ కు రానా ట్వీట్ అంటే టెర్రర్ అని రానా అభిమానులు రీట్వీట్ చేస్తున్నారు.



Tags:    

Similar News