• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రానా డిమాండ్ మామూలుగా...

రానా డిమాండ్ మామూలుగా లేదుగా

By - Tupaki Desk
Update: 2018-03-05 10:07 GMT
బాబాయ్ వెంకటేష్ లాగా కమర్షియల్ హీరోగా సెటిలవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రానాకు బాహుబలి కొత్త దిశా నిర్దేశనం చేసింది. లీడర్ మినహాయించి రెగ్యులర్ ఫార్మాట్ లో చేసిన నా ఇష్టం, నేను నా రాక్షసి, కృష్ణం వందే జగద్గురుం అన్ని మిశ్రమ ఫలితాలు ఇవ్వడంతో రూట్ మార్చిన రానాకు ఇప్పుడు బాగానే వర్క్ అవుట్ అవుతోంది. పాత్రల ఎంపికలో నిబంధనలు పెట్టుకోకుండా దూసుకుపోతున్న రానా యాంకర్ గా కూడా తన మొదటి షో 'నెంబర్ వన్ యారి' సక్సెస్ చేసి చూపించి బుల్లితెరపై కూడా తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా బిగ్ బాస్ షో సీజన్ 2 కి స్టార్ మా ఛానల్ రానా వైపే చూస్తున్నట్టుగా తాజా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఇచ్చిన కమిట్మెంట్ వల్ల చేయలేను అని చెప్పేయడంతో ప్రత్యాన్మాయం కోసం వెతికిన స్టార్ ఛానల్ వేట రానా దగ్గర ఆగిందని టాక్.

తొలుత న్యాచురల్ స్టార్ నాని - స్టైలిష్ స్టార్ బన్నీ పేర్లు కూడా వినిపించాయి కాని వాళ్ళలో ఎవరో ఒకరు ఓకే చెప్పినా సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పట్టేలా ఉండటంతో పాటు యాంకరింగ్ అలవాటు లేని ఆ ఇద్దరు ఎంతవరకు దీన్ని క్యారీ చేయగలరు అనే దాని గురించి కూడా చర్చలు జరిగాయట. రెమ్యునరేషన్ విషయంలో సైతం బడ్జెట్ ఎక్కువయ్యే అవకాశాలు ఉండటంతో ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైనా రానాకే ఓటు వేయాలని నిర్ణయించి ఆ మేరకు ప్రతిపాదన కూడా పంపారట.

కాని రానా మాత్రం తనకు నెంబర్ వన్ యారి కంటే అధిక పారితోషికం కావాలని అడిగినట్టు టీవీ మీడియా సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఎంత మొత్తం అనేది బయటికి  రాలేదు కాని కాల్ షీట్స్ దీనికి ఎక్కువ అవసరం పడతాయి కాబట్టి ఆ మేరకు రానా ఒక ఫిగర్ కోట్ చేసినట్టు టాక్. ఒకవేళ స్టార్ మా ఇది భరించదగ్గ మొత్తమే అని ఫీల్ అయితే బిగ్ బాస్ 2 యాంకర్ గా రానాను చూడడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.  


Tags:    
  • Rana 
  • Bigg Boss Season 2 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS