• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అచ్చ తెలుగందమే'.. మహేష్...

'అచ్చ తెలుగందమే'.. మహేష్ మేనల్లుడి కోసం సిద్ శ్రీరామ్ పాడిన మెలోడీ..!

By - Tupaki Desk
Update: 2021-10-25 05:01 GMT
సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనల్లుడు.. ఏంపీ గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రం ''హీరో''. యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అశోక్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మహేష్ చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్ లుక్ - టైటిల్ టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. కౌబాయ్ - లవర్ బాయ్ - యాక్టన్ హీరో - జోకర్.. ఇలా అన్ని వెరీయేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు.

''హీరో'' చిత్రాన్ని నవంబర్ నెలలోనే థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అగ్రెసివ్ గా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు సోమవారం సినిమాలోని ''అచ్చ తెలుగందమే'' అనే మెలోడీ గీతాన్ని హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.

'నింగిలో తారక నేలపై వాలెనే.. కన్నుల పండగై కాలమే ఆగనే.. ప్రేమనే బాణమే నన్నిలా తాకేనే..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. యువ గాయకుడు సిద్ శ్రీరామ్ మరోసారి తన గాత్రంతో మాయ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ ఈ గీతానికి స్వరాలు సమకూర్చగా.. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సాంగ్ లో అశోక్ - నిధి అగర్వాల్ లుక్స్.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరాయి. నిధి వెటర్నరీ డాక్టర్ గా కనిపిస్తుండగా.. హీరో ఆమె ప్రేమ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. విజువల్ పరంగా కూడా 'అచ్చ తెలుగందమే' పాట ఆకట్టుకుంటోంది.

సూపర్ స్టార్ కృష్ణ మరియు గల్లా అరుణకుమారి సమర్పణలో ''హీరో'' సినిమా రూపొందుతోంది. అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమీర్ రెడ్డి - రిచర్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో జగపతిబాబు - నరేష్ - కౌశల్యా - వెన్నెల కిశోర్ - బ్రహ్మాజీ - సత్య - అర్చన సౌందర్య - మైమ్‌ గోపి - అజయ్‌ ప్రభాకర్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడోతరం హీరో కావడంతో 'హీరో' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.





Full View


Tags:    
  • HERO 
  • HERO movie 
  • HeroFromNovember 
  • AcchaTelugandhame 
  • Hero 
  • Ghibran 
  • Ashok Galla 
  • AchaTelugandhame Lyrical Song 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS