• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేను వేశ్య అనగానే వారు...

నేను వేశ్య అనగానే వారు షాక్ అయ్యారు

By - Tupaki Desk
Update: 2019-03-12 12:18 GMT
తమిళంలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మూవీ 'సూపర్‌ డీలక్స్‌'. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సమంత మరియు రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కుమార రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి లేడీ గెటప్‌ లో కనిపించడంతో పాటు, రమ్యకృష్ణ వేశ్య పాత్రలో కనిపించనుంది అనే విషయాలు సినిమాపై మరింతగా అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు కూడా సినిమాను ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలు కురిపిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలో వేశ్య పాత్రలో నటించిన రమ్యకృష్ణ మాట్లాడుతూ... కొన్ని సినిమాలు పాపులారిటీ తెచ్చి పెడతాయి, కొన్ని సినిమాలు డబ్బును తెచ్చి పెడతాయి, కొన్ని సినిమాలు మాత్రమే నటిగా సంతృప్తిని తెచ్చి పెడతాయి. అలాంటి పాత్రే లీలా. బాహుబలి చిత్రంలో నేను చేసిన శివగామి పాత్ర తర్వాత తనకు అత్యంత నచ్చిన పాత్ర లీలా. ఈ చిత్రం గురించి, పాత్ర గురించి దర్శకుడు చెప్పిన వెంటనే నేను చాలా ఎగ్జైట్‌ అయ్యాను. కాని నా అసిస్టెంట్స్‌ మాత్రం షాక్‌ అయ్యారు. ఇలాంటి పాత్రలో మీరు ఎలా నటిస్తారంటూ నన్ను అడిగారు. నటిగా ఇలాంటి పాత్రలు చేసే అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు రాదు. ఆ అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను అంటూ చెప్పుకొచ్చింది.

లీలా పాత్ర కేవలం తమిళ ఆడియన్స్‌ కు మాత్రమే కాకుండా దక్షిణాది ప్రేక్షకులందరికి కూడా నచ్చుతుందనే నమ్మకంను రమ్యకృష్ణ వ్యక్తం చేసింది. ఈ చిత్రంను దర్శకుడు కుమార రాజా చాలా విభిన్నంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులు మరియు విమర్శకులు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తారనే నమ్మకం ఉంది. దక్షిణాదిలో నిలిచిపోయే సినిమాగా సూపర్‌ డీలక్స్‌ ఉంటుందనే నమ్మకంను రమ్యకృష్ణ వ్యక్తం చేసింది.

ఈ చిత్రం ట్రైలర్‌ కు మంచి స్పందన దక్కింది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కోసం సమంత అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంత ఈ చిత్రంలో చాలా విభిన్నమైన పాత్రలో కనిపించబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. సినిమా విడుదల కోసం తమిళ ఆడియన్స్‌ తో పాటు తెలుగు ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మంచి ఓపెనింగ్స్‌ నమోదు అయ్యే అవకాశం ఉందనిపిస్తుంది.
Tags:    
  • Ramya Krishna 
  • Super Deluxe Movie 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS