• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రోబో-2లోకి ఎవరొస్తున్నారో...

రోబో-2లోకి ఎవరొస్తున్నారో తెలుసా?

By - Tupaki Desk
Update: 2016-06-07 07:00 GMT
ప్రస్తుతానికి ఇది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు కానీ.. రోబో-2 యూనిట్లో కొందరు చెబుతున్న దాని ప్రకారమే నిజమనే అనుకోవాలి. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ‘బాహుబలి’ సినిమాతో రమ్య పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆమె నటన గురించి అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగింది. ఇక రజినీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్‌ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

‘నరసింహ’ సినిమాలో రజినీ-రమ్య కెమిస్ట్రీ ఓ రేంజిలో పండింది. ఈ నేపథ్యంలోనే రోబో-2లో ఆమె నటిస్తే సినిమాకు మరింతగా క్రేజ్ వస్తుందన్న ఉద్దేశంతో వేరే వాళ్లకు అనుకున్న ఓ కీలక పాత్రను రమ్యకృష్ణకు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆల్రెడీ ఆమె షూటింగ్‌ లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. రమ్యది సినిమాలో నెగెటివ్ రోల్ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదంతా నిజమే అయితే రజినీ-రమ్య మధ్య వార్ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.

భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ‘రోబో-2’కు ‘2.0’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో రజినీ సరసన అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటిదాకా 40 శాతం షూటింగ్ పూర్తయినట్లు చెబుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2017 ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.
Tags:    
  • Ramya Krishna 
  • Robo 2 Movie 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS