క్రియేటివ్ ప్రొడ్యూసర్ మెగా ఫోన్ పట్టేశాడు

Update: 2015-11-12 09:30 GMT
దర్శకులు నిర్మాతలుగా మారడం మామూలే. కానీ నిర్మాతలు దర్శకులవడం అరుదు. ఇప్పుడున్న నిర్మాతల్లో ఎమ్మెస్ రాజు - మధుర శ్రీధర్ మాత్రమే ఈ జాబితాలో కనిపిస్తారు. ఇప్పుడు ఇంకో నిర్మాత వారి సరసన చేరబోతున్నాడు. ఆయనే రామ్మోహన్. ఉయ్యాల జంపాల లాంటి డిఫరెంట్ మూవీతో నిర్మాతగా పరిచయమైన రామ్మోహన్ కు మొదట్నుంచి దర్శకత్వంపై ఇష్టముంది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాకు ఆయన మాటలు కూడా అందించాడు. అంతే కాదు.. నాగార్జున సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’కు కథ కూడా ఆయనదే.

రామ్మెహన్ దర్శకత్వ అవకాశం కోసం కూడా ఎక్కువ కాలం ఎదురు చూడలేదు. సురేష్ బాబుతో కలిసి స్వీయ నిర్మాణంలో సైలెంటుగా సినిమా మొదలుపెట్టి పూర్తి చేసేశాడు. అదే.. తను నేను. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ అవికా గోర్ ఇందులో హీరోయిన్ కాగా.. సంతోష్ శోభన్ అనే కొత్త కుర్రాడు హీరో. ఈ సంతోష్ శోభన్ ఎవరో కాదు.. వర్షం సినిమా దర్శకుడు శోభన్ కొడుకు. శోభన్ కొన్నేళ్ల క్రితం హఠాత్తుగా మృతి చెందిన సంగతి తెలిసిందే. రవిబాబు - సత్యకృష్ణన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News