• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారికి రామ్‌ చరణ్...

వారికి రామ్‌ చరణ్ సెల్యూట్‌

By - Tupaki Desk
Update: 2021-10-23 08:30 GMT
కరోనా ఫస్ట్ వేవ్‌ మరియు సెకండ్‌ వేవ్‌ సమయంలో మెడికల్‌ టీమ్‌ చేసిన సేవ కారణంగానే ఎంతో మంది ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారు అనడంలో సందేహం లేదు. దేశంలోని వైధ్య సిబ్బంది మొత్తం కూడా తమ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా కరోనాతో పోరాటం సాగించారు. వారికి ఎంత ఇచ్చినా తక్కువే.. ఏం చేసినా తక్కువే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వైపు కరోనాతో పోరాటం సాగిస్తూనే మరో వైపు కరోనా వ్యాక్సిన్‌ ను జనాలకు ఇవ్వడంలో వైధ్య సిబ్బంది సూపర్‌ సక్సెస్ అయ్యారు. తక్కువ సమయంలోనే వంద కోట్ల డోసులను ఇండియాలో ఇచ్చిన ఘనత వైధ్య సిబ్బందికి దక్కింది. డాక్టర్లతో పాటు కింది స్థాయి సిబ్బంది మరియు వైధ్యాధికారులు అంతా కూడా ఈ మహా కార్యంలో పాలు పంచుకుని విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇండియాలో వంద కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి అయిన సందర్బంగా వైధ్య సిబ్బందిని ఎంతో మంది ప్రముఖులు అభినందించారు. ప్రథాని నరేంద్ర మోడీతో పాటు జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ విషయమై స్పందించారు. ఈ విషయమై మెగా హీరో రామ్‌ చరణ్‌ కూడా స్పందించాడు. ఇండియా వంద కోట్ల వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకోవడం అభినందనీయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెడికల్‌ టీమ్ లోని ప్రతి ఒక్కరికి నా సెల్యూట్‌. ఒక అద్బుతమైన చారిత్రాత్మక ఘనతను మీరు దక్కించుకున్నారు అంటూ మెడికల్‌ సిబ్బందిపై రామ్‌ చరణ్‌ ప్రశంసలు కురిపించాడు. ట్విట్టర్ లో రామ్‌ చరణ్ చేసిన ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక రామ్‌ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు. జనవరిలో ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల కాబోతుంది. ఆచార్య సినిమాలో గెస్ట్‌ రోల్ చేసిన చరణ్‌ ఆ సినిమాతో ఫిబ్రవరిలో రాబోతున్నాడు. మరో వైపు శంకర్ దర్శకత్వంలో సినిమాను నిన్నటి నుండే మొదలు పెట్టాడు. రామ్‌ చరణ్‌ మరియు శంకర్ ల కాంబో మూవీ ప్రస్తుతం పుణె  లో భారీ ఎత్తున వేసిన ఒక సెట్టింగ్‌ లో జరుగుతోంది. అక్కడ రెండు వారాల పాటు షూటింగ్ ఉంటుందని సమాచారం అందుతోంది.


Full View




Full ViewFull View
Tags:    
  • Ramcharan 
  • Ramcharan tweet 
  • 100 crore doses 
  • 100 crore vaccine 
  • one billion vaccine 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS