రామారావు వన్డే ఆన్ డ్యూటీ

Update: 2021-08-29 06:10 GMT
రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా పై అందరి దృష్టి ఉంది. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా విభిన్నంగా ఉండటంతో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రామారావు అనే ఆఫీసర్‌ కు సంబంధించిన కథను ఒక రాత్రి జరిగే సంఘటనలతో చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

ఒక్క రాత్రి జరిగే కథలో ఫ్ల్యాష్‌ బ్యాక్‌ సన్నివేశాలు రాబోతున్నాయి. అలా రామారావు ఆన్ డ్యూటీ సినిమా సాగుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తమిళంలో ఈమద్య వచ్చిన ఖైదీ సినిమా కథ మొత్తం ఒక్క రాత్రి సాగుతుంది. ఆ రాత్రి లోనే సినిమా మొత్తం కూడా నడుస్తుంది. ఇప్పుడు రవితేజ చేస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా అలాగే ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఫ్ల్యాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో హీరోయిన్‌.. రొమాన్స్.. కామెడీ పాటలు ఇలా అన్ని ఉంటాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

రవితేజ ఇప్పటికే ఖిలాడీ సినిమాతో విడుదలకు సిద్దంగా ఉన్నాడు. పరిస్థితులు అనుకూలించి థియేటర్లు దొరికితే వెంటనే విడుదలకు సిద్దం చేయబోతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామారావు ఆన్ డ్యూటీ సినిమాను వచ్చే ఏడాది లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ చేస్తున్నారట. ఒక ప్రభుత్వ అధికారి జీవితంలో ఒక్క రోజు రాత్రి జరిగే సంఘటనలు మరియు ఆయన గతంలో జరిగిన విషయాలను విభిన్నమైన స్క్రీన్‌ ప్లే తో నడిపించే సినిమాగా రామారావు ఆన్ డ్యూటీ సాగుతుంది అంటూ సమాచారం అందుతోంది.

ఈ సినిమా లో రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్ మరియు మలయాళ క్రేజీ బ్యూటీ రజీష విజయన్‌ నటిస్తున్నారు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సబ్జెక్ట్‌ కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రవితేజ చేశాడంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు.
Tags:    

Similar News