కరోనా కంటే అది భయంకరమైనది : రామ్‌

Update: 2020-08-17 17:00 GMT
విజయవాడ రమేష్‌ ఆసుపత్రి స్వర్ణ ప్యాలస్‌ ఇష్యూలో హీరో రామ్‌ వరుస ట్వీట్స్‌ చేస్తున్నాడు. స్వర్ణ ప్యాలస్‌ విషయంలో కొందరు జగన్‌ కు చెడ్డ పేరు తీసుకు వచ్చేలా తప్పుడు ప్రచారం మొదలు పెట్టారంటూ రామ్‌ ట్వీట్‌ చేశాడు. స్వర్ణ ప్యాలెస్‌ లో ప్రభుత్వం క్వారెంటైన్‌ సెంటర్‌ ను రన్‌ చేసిందని దానికి రమేష్‌ ఆసుపత్రికి సంబంధం లేదు అన్నట్లుగా రామ్‌ పేర్కొన్నాడు. కేసు విచారణ జరుగుతున్న ఈ సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా రామ్‌ కు కూడా నోటీసులు అందుతాయి అంటూ విచారణ అధికారి పేర్కొన్నారు.

రామ్‌ కు కొందరు బాసటగా నిలుస్తుంటే మరి కొందరు మాత్రం కులం పేరుతో దూషించడం మొదలు పెట్టారు. దాంతో మరోసారి ట్విట్టర్‌ ద్వారా రామ్‌ సీరియస్‌ అయ్యాడు. కులం అనేది కరోనా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ జబ్బు కరోనా కంటే భయంకరమైనది. ఇది సైలెంట్‌ గా విస్తరించి జీవితాలను నాశనం చేస్తుంది.

ఈ జబ్బు బారిన పడకండి. ఈ జబ్బును మీకు ఎవరైనా అంటించాలని ప్రయత్నించినా కూడా ఆ ఉచ్చులో పడకండి అంటూ ట్వీట్‌ చేశాడు. రమేష్‌ ఆసుపత్రి రామ్‌ బాబాయికి చెందినది అవ్వడం వల్ల ఇంతగా రియాక్ట్‌ అవుతున్నాడు అనేవారు కొంతమంది ఉన్నారు. మరికొందరు కులం పేరు చెప్పి రామ్‌ ను విమర్శించేందుకు ప్రయత్నించాడు. ఆ కారణంగానే రామ్‌ కులంపై సీరియస్‌ అయ్యాడు.
Read more!
Full ViewFull View
Tags:    

Similar News