రామ్ కి ఆ కథలు పాఠాలు నేర్పాయి
కథల విషయంలో తప్పటడుగులు వేస్తే ఎలా ఉంటుందో గతానుభవాలు స్పష్టంగా చెప్పాయి రామ్‌కి. రొటీన్ కథల్ని - రొటీన్ క్యారెక్టర్ లని తెరపై చూపిస్తే అభిమానులైనా క్షమించరు అని ప్రాక్టికల్ గా ప్రూవైంది. ఇటీవలే రిలీజైన శివమ్ అట్టర్ ఫ్లాప్ అవ్వడం వెనక కథ - కాకరకాయ - గమ్యం లేకపోవడమే కారణం. రొటీన్ కథే అయినా పండగ చేస్కోలో క్లారిటీ ఉంది కాబట్టి విజయం దక్కింది. ఈ విషయాలన్నిటినీ విశ్లేషించుకున్నాడో ఏమో.. కథల ఎంపిక విషయంలో రామ్ చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు. వైవిధ్యం కోసం తపిస్తున్నాడుట.
తన ఆస్థాన రైటర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలోనే ఇప్పుడు హరికథ అనే చిత్రంలో నటించడానికి అదే ప్రేరణ అని చెబుతున్నారు. అయితే ఈ కుర్రహీరో కథల విషయంలో అతిగా ఆలోచిస్తూ వేలు పెట్టి కెలకడం వల్ల కూడా గత పరాభవాలు ఎదురయ్యాయన్న విమర్శ కూడా ఉంది. ఒక సినిమా జయాపజయాలకు దర్శకుడు ఎంత బాధ్యుడో, హీరో కూడా అంతే బాధ్యుడు అని రామ్ భావించడం వల్లే ఇలా కథల్లో వేలు పెడుతున్నాడని అనుకోవచ్చు. ఆమాత్రం జాగ్రత్త లేకపోతే మునుముందు భవిష్యత్ చాలా కష్టం. ప్రస్తుతం హరికథ చిత్రం మెజారిటీ భాగం చిత్రీకరణ పూర్తయింది.
అయితే ఇప్పటికే వచ్చిన ఔట్ పుట్ ని రషెస్ లో చూసుకున్న రామ్ కొంత అసంతృప్తికి లోనయ్యాడట. అందుకే అందులో అంతగా నచ్చని సన్నివేశాల్ని తిరిగి రీషూట్ చేద్దామని అడిగాడుట. అందుకే మరోసారి స్ర్కిప్టు విషయంలో తర్జనభర్జన పడిన తర్వాత ఆ మార్పులు చేర్పుల కోసం యత్నిస్తున్నారని తెలుస్తోంది. రామ్ చేసే ప్రయత్నం మంచిదే. పక్కాగా 100శాతం శాటిస్ ఫై అయ్యాకే సినిమా రిలీజ్ చేస్తే మంచిది. ఆల్ ది బెస్ట్.