• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్‌ టాక్‌ : మరీ...

పిక్‌ టాక్‌ : మరీ 'లోఫర్‌', 'రోగ్‌'లా ఉన్నాడుగా

By - Tupaki Desk
Update: 2019-01-24 08:00 GMT
2015లో వచ్చిన 'టెంపర్‌' తర్వాత పూరి జగన్నాధ్‌ కి పెద్దగా సక్సెస్‌ అందుకోలేక పోయాడు. భారీ అంచనాల నడుమ కొడుకుతో తీసిన 'మెహబూబా' చిత్రం తీవ్ర నిరాశ పర్చింది. మెహబూబా చిత్రం తర్వాత పూరి చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఎట్టకేలకు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా పూరి దర్శకత్వంలో ఒక మూవీ ప్రారంభం అయ్యింది. తన ప్రతి సినిమాలో కూడా హీరోను అల్లరి చిల్లరగా చూపించే దర్శకుడు పూరి ఈ చిత్రంలో కూడా హీరో రామ్‌ ను అదే తరహాలో చూపించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది.

'లోఫర్‌' చిత్రంలో వరుణ్‌ మరియు 'రోగ్‌' చిత్రంలో హీరో పాత్రల తరహాలో 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాలో రామ్‌ పాత్ర ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. చేతిలో గన్‌, నోట్లో సిగరెట్ పెట్టుకుని, షర్ట్‌ బటన్స్‌ విప్పి, టోన్డ్‌ పాయింట్‌ వేసుకున్న రామ్‌ గత చిత్రాల్లోకి చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. అయితే పూరి గత చిత్రాల్లో హీరో మాదిరిగానే రామ్‌ ఉన్నాడు. గతంలో పూరి ఇలాంటి హీరో పాత్రలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది.

హీరోలు కాస్త క్లాస్‌ గా, రొమాంటిక్‌ గా ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ చిత్రంలో మాత్రం రామ్‌ మరీ లోఫర్‌ లా కనిపిస్తున్నాడు. లుక్‌ ఎలా ఉన్నా ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రీన్‌ ప్లే తో సినిమాను తెరకెక్కిస్తే తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ చిత్రం పూరి మరియు రామ్‌ లకు చాలా కీలకం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ గా అను ఎమాన్యూల్‌ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    
  • Ram Ismart Shankar First Look 
  • Ismart Shankar 
  • Hero Ram 
  • Telugu News 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS