చిత్ర పరిశ్రమ రెండుగా విడిపోవాలి
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతి సెన్సేషన్ లో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆకలేసిన పులికి ఆహారం ఎంత అవసరమో ఆయనకు కాంట్రోవర్శీలు అనే ఆకలి కూడా అంతే అవసరం. వివాదాలే ఆయనకు వివాహ భోజనం. అంతే కాకుండా ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా వర్మ తనదైన శైలిలో స్పందించి అరే ఈ విషయంలో రాము గారు చెప్పింది కొంచెం పాజిటివ్ గా ఉందే అనుకుంటాం.
అయితే అప్పుడప్పుడు రాముడు మంచి బాలుడు అన్నట్లు తన మాటలతో కొన్ని మెస్సేజ్ లను ఇస్తూ.. ఆకట్టుకుంటాడు. రీసెంట్ గా అర్జున్ రెడ్డి సినిమా ముద్దు కాంట్రవర్సీలో వర్మ సర్ ఏ రేంజ్ లో సినిమాకి హైప్ తెచ్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు మరో స్థాయిలో తెలంగాణ ప్రభుత్వానికి తనదైన శైలిలో ఇన్ స్టాగ్రామ్ ద్వారా కొన్ని సందేశాలను జారీ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమాతో తెలంగాణలో తప్పకుండా ఓ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పడుతుందని చెప్పేశాడు. ఎందుకంటే తెలంగాణలో కూడా యువ దర్శకులు హీరోలు చాలా వినూత్నంగా సినిమాలు తీస్తూ.. అందరిని ఆకట్టుకుంటున్నారని చెప్పాడు.
అలాగే ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా సినిమాలు తియ్యడం తెలంగాణ న్యూ డైరెక్టర్స్ కి తప్ప ఎవరు తియ్యలేరని చెప్పాడు. అలాగే ఒక కరీంనగర్ స్టైల్ లో సినిమాను తియ్యడం ఇప్పటి తెలుగు ఇండస్ట్రీలో లో ఉన్న వారిలో ఎవరు తియ్యలేరని చెబుతూ.. కేసీఆర్ - కేటీఆర్ గారిని తెలంగాణలో యువకుల్లో ఉన్న టాలెంట్ ని గుర్తించాలని తెలంగాణ చిత్ర పరిశ్రమ కూడా ఏర్పడితే తెలంగాణకు కూడా ఒక గుర్తింపు ఉంటుందని చెప్పాడు. అలా జరగాలంటే తెలుగు చిత్ర పరిశ్రమ సెపరేట్ అవ్వాలని అప్పుడు మాత్రమే ఒక ఐడెంటిటీ వస్తుందన్నారు వర్మ. చూద్దాం జనాలు ఏమంటారో!!