అంతా నా ఇష్టం అంటున్న వర్మ

Update: 2016-02-12 01:30 GMT
సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వంగవీటి.. ఇప్పటికే చాలా సెన్సేషన్లకు వేదిక అవుతోంది. బెజవాడ బేస్డ్ గా వంగవీటి రాధా - వంగవీటి రంగాల చుట్టూ తిరిగే ఈ సినిమాతో.. సమాజంలో అలజడి చెలరేగేందుకు వర్మకారణం అవుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై వర్మ తన వెర్షన్ వినిపించాడు.

'అంత బాధ్యత లేకుండా నేనెందుకు సినిమాలు తీస్తాను?' ఇదీ ఓ టీవీ ఇంటర్వ్యూలో వర్మ ఇచ్చిన సమాధానం. 'కులాల గురించి ముట్టుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అప్పుడు సొసైటీలో ఈక్వేషన్స్ మారతాయి. అలాగే వంగవీటి మూవీ తీయద్దని నాకు ఎవరైనా చెబుతున్నారంటే ఇది నాన్సెన్స్ కిందే లెక్క. ఇలాంటి వాళ్లను నేను పట్టించుకోను. అసలు వంగవీటి గురించి నాకు లెక్చర్స్ ఇవ్వడం మానేయమనండి' అంటూ ఓ రేంజ్ లో కసురుకున్నాడు రామ్ గోపాల్ వర్మ.

'ముందు నేను తీసిన సినిమా ఏంటో చూడాలి. అప్పుడే ఎవరైనా దానిమీద కామెంట్  చేయాలి. అదేమీ జరగప్పుడు అసలు డిబేట్ కూడా అనవసరం' అని తేల్చిన వర్మ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వంగవీటిని తెరపైకి తెస్తానని చెప్పాడు. ఎన్టీఆర్, రాజీవ్ గాంధీలు కూడా ఈ సినిమా పాత్రలుగా చేసేసి.. ఏ రేంజ్ లో బెజవాడ రాజకీయం గురించి చెప్పనున్నాడనే ఆసక్తి మాత్రం జనాల్లో రోజురోజుకీ పెరిగిపోతోంది.

Tags:    

Similar News