రీ రిలీజ్ దెబ్బ రత్నంపై పడిందే..

కోలీవుడ్ లో కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విశాల్.

Update: 2024-04-29 05:13 GMT

కోలీవుడ్ లో కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విశాల్. తాజాగా విశాల్, హరి దర్శకత్వంలో తెరకెక్కిన రత్నం మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తమిళ్, తెలుగు భాషలలో ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. తమిళనాడు, ఆంధ్రా సరిహద్దులో రాష్ట్ర విడిపోయిన సమయంలో జరిగిన గొడవల నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉంటుంది.

అయితే ఈ సినిమాకి రెండు భాషలలో కూడా డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ పై కోలీవుడ్ లో మరో ప్రభావం కూడా పడింది. ఇళయదళపతి విజయ్ సూపర్ హిట్ మూవీ గిల్లి ఏప్రిల్ 20న రీరిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి మొదటి రోజే ఏకంగా 8 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి. రీరిలీజ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్, గిల్లి ముందు వరకు పవన్ కళ్యాణ్ ఖుషి పేరు మీద ఉంది.

అయితే ఈ రికార్డ్ ని గిల్లి ఒక్క రోజులోనే బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా రీరిలీజ్ కి మంచి ఆదరణ వస్తూ ఉండటంతో థియేటర్స్ లో కొనసాగించారు. రీసెంట్ గా ఈ సినిమా 20 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసిందంట. లాంగ్ రన్ లో 25 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంటుంది అని అంచనా వేస్తున్నారు. గిల్లి ఎఫెక్ట్ రత్నం సినిమాపైనే గట్టిగానే పడిందని కోలీవుడ్ టాక్ వినిపిస్తోంది.

రత్నం మూవీ మూడు రోజుల్లో 6.75 కోట్ల నెట్ మాత్రమే వసూళ్లు చేసింది. మొదటి రోజు తమిళనాడులో 1.75 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో 70 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. రెండో రోజు తమిళనాడులో 1.66 కోట్లు, తెలుగులో 0.55 కోట్లు రత్నం కలెక్ట్ చేసింది. మూడో రోజు రెండు రాష్ట్రాలలో కలిపి 2.15 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Read more!

ఈ లెక్కలు చూసుకుంటే విజయ్ రీరిలీజ్ మూవీతో కూడా కనీసం రత్నం పోటీ పడలేకపోయిందనే మాట వినిపిస్తోంది. సింగం సిరీస్ తో సూపర్ హిట్స్ కొట్టిన హరి దర్శకుడి నుంచి వచ్చిన సినిమా ఇది. అయినప్పటికి తమిళ్ ఆడియన్స్ కూడా కనీసం ఆదరించలేదు. ఇక గిల్లి సినిమా రీ రిలీజ్ లో మంచి కలెక్షన్స్ అందుకోవడంతో మరికొన్ని సినిమాలను కూడా గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఆ సినిమాలు ఎలాంటి కలెక్షన్లు అందుకుంటాయో చూడాలి.

Tags:    

Similar News