వంగా స్పిరిట్.. ప్రభాస్ కటౌట్ కు తగ్గ బ్యూటీలు!

ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Update: 2024-04-29 06:24 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన కల్కి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్.. ఇటీవల రాజా సాబ్ సెట్స్ లో అడుగుపెట్టారు. రీసెంట్ గా ఓ సాంగ్ ను డైరెక్టర్ మారుతి షూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

 

ఇక త్వరలో ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేస్తున్న సందీప్.. మరికొద్ది రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీని డిసెంబర్ లో పట్టాలెక్కించనున్నట్లు తెలిపారు. గతేడాది తీసిన యానిమల్ సక్సెస్ అవ్వడం, ప్రభాస్‌ సిల్వర్‌ జూబ్లీ చిత్రం కావడంతో సందీప్‌ రెడ్డి వంగాకు స్పిరిట్‌ ఓ ఛాలెంజింగ్ మూవీగా మారింది.

 

దీంతో సందీప్.. ఈ సినిమా విషయంలో పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ హీరోయిన్ కోసం ఆయన సెర్చ్ చేస్తున్నారట. ఇటీవల రష్మిక, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లను సందీప్ పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. రష్మికను ఫైనల్ కూడా చేసినట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ లో చరణ్ సరసన నటిస్తున్న కియారా అద్వానీ.. స్పిరిట్ లో హీరోయిన్ గా యాక్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే సందీప్.. ఆమెను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. మరో హీరోయిన్ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను సెలెక్ట్ చేసే ఆలోచనలో సందీప్ వంగా ఉన్నట్లు సమాచారం. మరి వీటిలో నిజమంతనేది తెలియదు. మేకర్స్ నుంచి అఫీషియల్‌ అనౌన్స్మెంట్స్ వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

మరోవైపు, ప్రభాస్ పాత్రపై సందీప్ వంగా స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఆయన బాడీ లాంగ్వేజ్‌ కు తగ్గట్టుగా.. తనదైన మార్క్‌ చూపించే విధంగా స్క్రిప్ట్‌ ను మలుస్తున్నారని టాక్ వస్తోంది. దాదాపు రూ.300 కోట్లకుపైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ మూవీపై ప్రభాస్ అభిమానుల్లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎంత వరకు అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News