దీని గురించా వర్మ అంత హడావుడి చేసింది

Update: 2018-12-15 17:30 GMT
రామ్ గోపాల్ వర్మ మాటలకు.. ఆయన సినిమాలకు అసలు పొంతనే ఉండట్లేదు చాలా ఏళ్లుగా. తన ప్రతి సినిమా గురించీ ఆహా ఓహో అని చెబుతాడు. బయట ప్రమోషన్లలో ఆయన చెప్పే మాటలు వింటే ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. కానీ మాటల్లో చూపించే చాతుర్యం సినిమా తీయడంలో చూపించట్లేదు వర్మ. దర్శకుడిగా ఆయన ఏ స్థాయిలో పతనం అయ్యాడో ‘ఆఫీసర్’తోనే రుజువైంది. కనీసం నిర్మాతగా అయినా కొంచెం క్రెడిబిలిటీ ఉందనుకుంటే.. దాన్ని ‘భైరవగీత’ తుడిచేసింది. ‘భైరవ గీత’ గురించి కొన్ని నెలలుగా చాలా గొప్పలు పోతున్నాడు వర్మ. ఈ చిత్ర దర్శకుడు సిద్దార్థ తాతోలు గురించి ఓ రేంజిలో చెప్పాడు. అతడి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని.. ‘భైరవ గీత’ చూసి స్టన్ అయిపోయానని.. అతను మామూలోడు కాదని అన్నాడు.

కానీ ‘భైరవ గీత’ చూస్తే వర్మ తీసిన ఫ్యాక్షన్.. మాఫియా సినిమాలకు నకలులా అనిపించింది. ఎప్పుడూ వర్మ సినిమాల్లో చూసే కథలు.. సన్నివేశాలు.. విజువల్స్.. కెమెరా యాంగిల్స్.. మ్యూజిక్ ఇందులో రిపీటయ్యాయి. సిద్దార్థ ఈ సినిమా తీసింది ప్రేక్షకుల్ని మెప్పించడానికా.. వర్మను ఇంప్రెస్ చేయడానికా అన్న సందేహాలు కలిగాయి. తెలుగు ప్రేక్షకులు ‘భైరవగీత’ను ఏకగ్రీవంగా తిరస్కరించారు. కానీ కన్నడలో వారం ముందు రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు రావడం.. సినిమా ఓ మోస్తరుగా ఆడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అక్కడొచ్చిన పాజిటివ్ రివ్యూల్ని షేర్ చేస్తూ తెలుగు వెర్షన్ ను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు వర్మ. కాబట్టి సినిమాలో ఏదో విషయం ఉందని చూసిన మన జనాలు థియేటర్ల నుంచి బయటికొస్తూ తలలు పట్టుకుంటున్నారు.
Tags:    

Similar News