ఆలియాతో వర్మ.. బ్యూటిఫుల్ గురూ

Update: 2017-01-23 14:17 GMT
అసలు యంగ్ బ్యూటి ఆలియా భట్ కు.. మన సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మకు లింకేంటి అంటారా? ఇప్పుడంటే ట్విట్టర్లో కామెంట్లు చేసుకుంటూ తన పేరును తానే చెడగొట్టుకుంటున్నాడు కాని.. ఒకప్పుడు మాత్రం వర్మ అంటే బాలీవుడ్ అంతా అటెన్షన్ లో ఉండేది. అమితాబ్‌ బచ్చన్ సైతం అడగ్గానే వర్మకు డేట్లు ఇచ్చేస్తున్నాడంటే.. మనోడి ప్రతిభకు అంతకంటే నిదర్శనం ఏం కావాలి?

నిజానికి వర్మ 'రంగీళా' సినిమా తీసి అందరికీ షాకిచ్చాడు. అప్పటివరకు బాలీవుడ్ లో అలాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చాలానే వచ్చినా.. ఇలాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. అందుకే వర్మంటే అక్కడి హీరోయిన్లకు ఇప్పటికీ ఎనలేని గౌరవమే. ప్రస్తుతం సర్కార్ 3 సినిమాను షూట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న వర్మ.. హీరోయిన్ ఆలియా భట్ కు ఒక కథను నెరేట్ చేశాడట. ఆమె వెంటనే ఒప్పేసుకోవడంతో.. ''బ్యూటిఫుల్'' అనే టైటిల్ తో ఆ సినిమాను రూపొందిస్తున్నాడని తెలుస్తోంది.

మొత్తానికి వర్మ మళ్ళీ పోగొట్టుకున్న చోటనే రాబట్టుకోవాలని డిసైడ్ అయిపోయి.. మరోసారి బాలీవుడ్ పై గట్టిగానే ఫోకస్ చేశాడని అనిపిస్తోంది. చూద్దాం ఇప్పుడైనా మనోడు సంచలన విజయాలు నమోదు చేస్తాడేమో.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News