ఆ వీడియోపై రామ్ గోపాల్ వర్మ వివరణ
రామ్ గోపాల్ వర్మ.. కాంట్రవర్శీ.. చాలా ఏళ్ల నుంచి ఇవి రెండూ జంట పదాలు. వివాదం అన్నది లేకుండా వర్మ బతకలేని పరిస్థితి చాలా కాలంగా కొనసాగుతోంది. తాజాగా ఒక వీడియోతో వర్మ వార్తల్లోకి వచ్చాడు. ఒక ఇంట్లో ఏదో పార్టీ జరుగుతుంటే ఓ అమ్మాయితో కలిసి వర్మ డ్యాన్స్ చేస్తున్న వీడియో అది. అందులో ఆ అమ్మాయితో రొమాన్స్ పండించే క్రమంలో వర్మ హద్దులు దాటి ప్రవర్తించడం చర్చనీయాంశం అయింది. ఈ వీడియో ఆ అమ్మాయి పాదాలకు వర్మ పాదాభివందనం కూడా చేశాడు. ఐతే ఈ వీడియోలో వర్మ మరీ శ్రుతి మించాడంటూ ఆయనపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. వర్మ మీద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్న వాళ్లూ లేకపోలేదు. ఐతే వర్మ ఈ వీడియో షేర్ చేస్తూ ఇందులో ఉన్నది తాను కాదని.. వాళ్ల మీద ఒట్టేస్తా వీళ్ల మీద ఒట్టేస్తా అని తన శైలిలో కామెంట్లు పెడుతుండటం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వర్మ ఈ వీడియోపై వివరణ ఇచ్చాడు. ఈ వీడియో నాలుగు రకాలుగా జనాలకు తప్పు అనిపించే అవకాశం ఉందంటూ.. ఆ నాలుగు పాయింట్లను వివరించాడు వర్మ. ఒకటి మత పరంగా ఇలా చేయడం తప్పు అనే వాదన ఒకటుంటుందని.. అలాగే పరాయి స్త్రీతో ఇలా చేయడం తప్పు అనే నైతికత ప్రకారం తప్పుగా అనిపించొచ్చని.. అలాగే వేరే వాళ్లు ఏమనుకుంటారనే కోణంలోనూ ఇది తప్పుగా తోస్తుందని.. ఇవన్నీ కాక చట్ట పరంగా ఇది తప్పు అనిపించొచ్చని.. ఐతే ఈ నాలుగు కోణాల్లో మొదటి మూడు కోణాలు తాను పట్టించుకోనని వర్మ అన్నాడు. తాను దేవుణ్ని నమ్మనని.. అలాగే తాను చేసేది తప్పు అనే పశ్చాత్తాపం ఉండదని.. వేరే వాళ్లు ఏమనుకుంటారో అన్న పట్టింపు కూడా ఉండదని వర్మ స్పష్టం చేశాడు. ఇక చట్టపరంగా తాను నిబంధనలన్నీ తప్పక పాటిస్తానని.. తాను చేసింది చట్టపరంగా తప్పు కాదని వర్మ తేల్చేశాడు. తాను అమ్మాయి కాళ్లకు దండం పెట్టడం పట్ల కొందరు మిత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారని.. వాళ్లను కూడా తాను పట్టించుకోనని వర్మ అన్నాడు.