బిఫోర్ బాహుబలి.. ఆఫ్టర్ బాహుబలి

Update: 2017-04-29 06:32 GMT
రామ్ గోపాల్ వర్మ అతిశయోక్తి మాటలకు పెట్టింది పేరు. తనకేదైనా నచ్చితే దాని గురించి ఆయన పొగిడే తీరు మామూలుగా ఉండదు. ఇప్పుడాయన దృష్టి ‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద పడింది. కొన్ని రోజులుగా ఆయన బాహుబలి నామస్మరణే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు రికార్డు కలెక్షన్లు సాధించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. బిఫోర్ క్రైస్ట్.. ఆఫ్టర్ క్రైస్ట్ అని కాలమానం గురించి మాట్లాడుకున్నట్లే.. ఇకపై ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకునేటపుడు బిఫోర్ బాహుబలి.. ఆఫ్టర్ బాహుబలి అని వేరు చేయాల్సి ఉంటుందని వర్మ అన్నాడు.

బాహుబలి-2 సాధించిన మెగా డైనోసర్ డే-1 కలెక్షన్లు ఖాన్లు.. రోషన్లు.. చోప్రాలు.. వీళ్లందరి సినిమాల వసూళ్ల కన్నా ఎక్కువని.. ఈ సందర్భంగా రాజమౌళిని కనుగొన్న కరణ్ జోహార్ కు తాను సెల్యూట్ చేస్తున్నానని వర్మ అన్నాడు. బాహుబలి-2ను ఇష్టపడ్డ ప్రేక్షకులందరూ కరణ్ జోహార్ కు పాదాభివందనం చేయాలని.. రాజమౌళి లాంటి మేధావిని కనుగొన్నది ఆయనేనని వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం బాలీవుడ్లో ప్రతి సూపర్ స్టార్.. ప్రతి స్టార్ డైరెక్టర్ బాహుబలి-2 ప్రభావం చూసి వణికిపోతున్నారని వర్మ అన్నాడు.రిపబ్లిక్ డే.. ఈద్.. ఇండిపెండెన్స్ డే.. దీపావళి.. క్రిస్మస్ లాంటి పండగలేమీ లేకపోయినా నాన్ హాలిడేలో కూడా బాక్సాఫీస్ దగ్గర బాహుబలి ప్రభంజనం సృష్టించిందంటూ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ను ఉద్దేశించి వర్మ స్పందిస్తూ.. ఇక బాలీవుడ్ జనాలందరూ రిలీజ్ స్ట్రాటజీలు మార్చుకోవాలని సూచించాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News