దీపికా పదుకొణే సౌత్ వైపు రానే రాదా?
ప్రతిగా దీపికా పదుకొణే కూడా తాను ఇవ్వాలనుకున్న వివరణ ఇచ్చేసింది. ఇదంతా గతం. మరి అమ్మడు మళ్లీ సౌత్ లో లాంచ్ అవుతుందా?;
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే `కల్కీ 2898` తో టాలీవుడ్ లో లాంచ్ అవ్వడం..అటుపై దర్శక, నిర్మాతలతో తలెత్తిన పని గంటలు..పారితోషికం వివాదం కారణంగా పార్ట్ 2 నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి దీపకను తొలగించినట్లు నిర్మాణ సంస్థ అధికారింగా ప్రకటించింది. దీంతో ప్రాజెక్ట్ నుంచి ఆమె వెళ్లలేదు తామే తీసేసాం అన్నది అక్కడ హైలైట్ అయింది. మీలాంటి వాళ్లతో మాకు వర్కౌట్ అవ్వదు. ఇండస్ట్రీలో నువ్వు నేర్చుకోవాల్సింది..తెలుసుకోవాల్సింది ఇంకా చాలానే ఉందంటూ చిన్న పాటి క్లాస్ పీకిందా సంస్థ.
యంగ్ హీరో చిత్రంతోనే చర్చ:
ప్రతిగా దీపికా పదుకొణే కూడా తాను ఇవ్వాలనుకున్న వివరణ ఇచ్చేసింది. ఇదంతా గతం. మరి అమ్మడు మళ్లీ సౌత్ లో లాంచ్ అవుతుందా? ప్రత్యేకించి టాలీవుడ్ లో రీలాంచ్ అవుతుందా? అన్నదే ఆసక్తికరం. ప్రస్తుతం బాలీవుడ్ లో అమ్మడు కమిట్ అవుతోన్న సినిమాలు చూస్తుంటే? టాలీవుడ్ పై అక్కసుతోనే అక్కడ యంగ్ హీరోలకు ఒకే చెబుతుందా? అన్న చర్చ ఫిలిం సర్కిల్స్ లో జరుగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి నటుడితో సినిమా వదిలేసి అక్కడ యంగ్ హీరోతో ఓ సినిమాకు కమిట్ అయింది.
బన్నీతో ముందే కమిట్ మెంట్:
ఇప్పటికిప్పుడు ఆ సినిమాకు కమిట్ అవ్వడానికి కారణం ఆ హీరోని తక్కువ చేయడమే కారణమా? అన్న సందేహాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడే బన్నీ 22వ చిత్రంలో నటిస్తోంది కదా? అన్న సందేహం రావడం సహజమే. అయితే `కల్కి 2` తో ఎగ్జిట్ అవ్వడానికి ముందే బన్నీ ప్రాజెక్ట్ లో భాగమైంది. అప్పటికే కొన్ని నెలలుగా ఆ చిత్ర దర్శక, నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి. అడ్వాన్స్ కూడా తీసుకుంది. అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా పెట్టింది.
కన్నడ ఛాన్సులు ఎందుకు వదులకుంటుంది?
ఇలాంటి తరుణంలో ఆ సినిమా నుంచి తప్పుకుంటే? చిక్కులు తప్పవు. ఈ కారణంగా ఆ ప్రాజెక్ట్ లో భాగమైంది? అన్నది ఓ వెర్షన్ గా వినిపిస్తోంది. తెలుగు లో ఇదే దీపిక చివరి సినిమా అవుతుందని భావిస్తున్నారు. `కల్కి 2` విషయంలో జరిగిన అవమానం నేపథ్యంలో సౌత్ లో ఆమె సినిమాలు చేసే అవకాశాలు పెద్దగా ఉండక పోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. సౌత్ పై అంత ఆసక్తి ఉంటే సొంత పరిశ్రమ కన్నడలో అవకాశాలు ఎందుకు వదులుకుంటుంది? అన్న డౌట్ కూడా రెయిజ్ అవుతోంది. మరి ఈ ప్రచారాలపై దీపిక ఎలా స్పందిస్తుందో చూడా లి. ప్రస్తుతం దీపికా పదుకొణే తన ఆస్థాన హీరో షారుక్ ఖాన్ తో కలిసి `కింగ్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.