బన్నీకి అమెరికాలో ఇప్పుడేం పని?
అయితే కొత్త షెడ్యూల్ లోనే కాదు.. డిసెంబర్ మొత్తం అల్లు అర్జున్ లేని సీన్స్ ను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.;
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న మూవీతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. అత్యున్నత సాంకేతికతో సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సినిమాలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు.
అదే సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ కు పెద్దపీట వేస్తూ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న ఆ సినిమా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని కాస్ట్లీ సినిమాల్లో ఒకటిగా నిలుస్తోంది. అయితే కొన్ని నెలల క్రితం మొదలైన బన్నీ- అట్లీ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసిన మేకర్స్.. రీసెంట్ గా కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రీసెంట్ గా హైదరాబాద్ వచ్చేశారు బన్నీ. అయితే మళ్లీ కొత్త షెడ్యూల్ కొద్ది రోజుల్లో మొదలవ్వనుండగా.. అందులో అల్లు అర్జున్ కు సంబంధించిన సీన్స్ లేవట. అందుకే ఆయన హైదరాబాద్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే కొత్త షెడ్యూల్ లోనే కాదు.. డిసెంబర్ మొత్తం అల్లు అర్జున్ లేని సీన్స్ ను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో బన్నీ అమెరికా వెళ్లనున్నారని సమాచారం. ఈ వీకెండ్ లోనే ఆయన యూఎస్ వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల పాటు అక్కడే ఉంటారని, మళ్లీ వచ్చే జనవరిలో రిటర్న్ అవుతారని వినికిడి.
అమెరికా వెళ్లనున్న అల్లు అర్జున్.. అక్కడ క్రిస్మస్, న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకోనున్నారని తెలుస్తోంది. అక్కడే ఉన్న స్నేహితులతో చిల్ అవ్వనున్నారని సమాచారం. అందుకు గాను ఇప్పటికే ప్లాన్ కూడా వేసుకుందట బన్నీ అండ్ గ్యాంగ్. అయితే కేవలం సెలబ్రేషన్సే కాదు.. అట్లీ మూవీ వర్క్స్ ను కూడా పర్యవేక్షించనున్నారట అల్లు అర్జున్.
సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు.. ఇప్పటికే అమెరికాలో జరుగుతున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ ఓ టీమ్ కొన్ని నెలలుగా వర్క్ చేస్తుందని టాక్ వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్.. స్వయంగా అమెరికాలో ఆ వర్క్స్ ను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. అలా అటు హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తూ.. ఇటు సినిమా పనులను చూడనున్నారట బన్నీ. న్యూ ఇయర్ అయ్యాక జనవరి 3-4 తేదీల్లో ఇండియాకు తిరిగి రానున్నారని టాక్.