భార‌తీయ స్పై సినిమాల‌పై దాయాది కుట్ర‌లు

నిజానికి పాక్ వ్య‌తిరేక సినిమాలు ఏవి వ‌స్తున్నా వాటిని నిలువ‌రించేందుకు గ‌ల్ప్ దేశాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.;

Update: 2025-12-11 20:18 GMT

ర‌ణ్ వీర్ సింగ్ న‌టించిన దురంధ‌ర్ భార‌తీయ స్పై విరోచిత పోరాటాల నేప‌థ్యంలో రూపొందించిన అసాధార‌ణ సినిమా. అందుకే దీనిని గ‌ల్ఫ్ దేశాలు య‌థావిథిగా నిషేధం విధించాయి. పాకిస్తాన్ తో అంట‌కాగే గ‌ల్ఫ్ దేశాలు, ఆ దేశానికి మ‌ద్ధ‌తుగా నిలుస్తూ ఆడుతున్న నాట‌క‌మిది.

పాకిస్తాన్ లో ప్ర‌వేశించి అక్క‌డ మాఫియాలో, రాజకీయాల‌లో విధ్వంశం సృష్టించే ఒక ఇండియ‌న్ స్పై క‌థ‌ను హ‌ర్షించేందుకు గల్ఫ్ దేశాలు ఆస‌క్తిగా లేవు. కార‌ణం ఏదౌనా దురంధ‌ర్‌పై నిషేధం విధించారు. అయితే విదేశాల నుంచి తొలి నాలుగు రోజుల్లో 44కోట్లు వ‌సూలు చేయ‌గ‌లిగింది దురంధ‌ర్. ఈ ఫ‌లితం చూసాక గ‌ల్ఫ్ లో కూడా రిలీజై ఉంటే మ‌రింత అద‌న‌పు వ‌సూళ్లు సాధ్య‌మయ్యేవ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ దురంధ‌ర్ గల్ఫ్ దేశాలలో లేదా యుఎఇ (జిసిసి బెల్ట్‌)లో విడుదలై ఉంటే సంఖ్య మ‌రింత పెరిగేది అని అంచ‌నా వేసింది ట్రేడ్. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇలు ధురంధర్ సినిమా విడుదలను అడ్డుకున్నాయి. పాకిస్తాన్ వ్య‌తిరేక చిత్రంగా భావించినందున ఆయా దేశాలు రిలీజ్ కి మోకాల‌డ్డాయి.

నిజానికి పాక్ వ్య‌తిరేక సినిమాలు ఏవి వ‌స్తున్నా వాటిని నిలువ‌రించేందుకు గ‌ల్ప్ దేశాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అక్క‌డ గుంపు రాజ‌కీయాలు వినోదాన్ని ప‌రిమితం చేస్తున్నాయి. ఈసారి కూడా దురంధ‌ర్ కి అలాంటిదే జ‌రిగింది. అయితే ఇది కేవ‌లం దురంధ‌ర్ వ‌ర‌కే ప‌రిమితం కాదు. భార‌తీయ స్పై ఆప‌రేష‌న్ సినిమాలు ఏవి విడుద‌ల కావాల‌న్నా గ‌ల్ఫ్ దేశాల‌లో ప‌రిమితులు ఉన్నాయి. చాలా అడ్డంకుల‌ను అధిగ‌మించి భార‌తీయ స్పై చిత్రాల‌ను గ‌ల్ఫ్ లో విడుద‌ల చేయాల్సి ఉంటుంది. అయితే ఇన్ని అడ్డంకులు ఉన్నా కానీ, ధురంధర్ బృందం ఒక ప్రయత్నం చేసింది. కానీ విచారకరంగా అన్ని దేశాలు ఈ సినిమా థీమ్‌ని ఆమోదించలేదు. అందుకే ధురంధర్ సినిమా ఏ గల్ఫ్ దేశాలలోనూ విడుదల కాలేదు.

అయితే ఇది కేవ‌లం దురంధ‌ర్ కి ఎదురైన ప‌రాభ‌వం మాత్రమే కాదు.. గ‌తంలోను ఫైట‌ర్, స్కై ఫోర్స్, డిప్ల‌మాట్ లాంటి దేశ‌భ‌క్తి (బార‌తీయ‌) సినిమాల‌ను రిలీజ్ చేయ‌నీయ‌కుండా అడ్డుకున్నారు గ‌ల్ఫ్ పాల‌కులు. హృతిక్ న‌టించిన‌ `ఫైటర్` సినిమాను మొదట్లో యుఏఇ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) మినహా అన్ని గల్ఫ్ దేశాలలో నిషేధించారు. ఈ సినిమా పుల్వామా దాడి చిత్రణ పాకిస్తాన్‌లోని కొన్ని వర్గాల నుండి విమర్శలకు దారితీసింది. ఈ సినిమా పాకిస్తాన్ వ్యతిరేక ఎజెండాను ప్రోత్సహిస్తోందని సున్నితమైన సమస్యను నిజాయితీగా తెర‌పై చూపించ‌ర‌ని ఆరోపణలు వచ్చాయి. కాన్ సీక్వెన్స్ ప్ర‌కారం.. ఒక రోజు తర్వాత యుఏఇ కూడా తన భూభాగంలో విడుదలను నిలిపివేసింది. ఫైట‌ర్ నిర్మాత‌లు కొన్ని సీన్లు తొల‌గించి స‌వ‌ర‌ణ‌లు చేసినా చివ‌రికి గ‌ల్ఫ్ లో విడుద‌ల‌కు నిరాక‌రించారు.

అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్, జాన్ అబ్రహం నటించిన ది డిప్లొమాట్ ఈ ఏడాదిలోనే విడుద‌ల‌య్యాయి. అయితే ఈ సినిమాలను వాటి కంటెంట్‌పై ఉన్న ఆందోళనల కారణంగా మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలలో నిషేధించారు. ఈ రెండు సినిమాలు కూడా పాకిస్తాన్ ని టార్గెట్ చేసే అజెండాతో ఉన్నాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

కాశ్మీర్‌లో వివాదాస్పద వ్యాసం రద్దు ఆధారంగా రూపొందించబడిన ఆర్టికల్ 370 (2024) కు గ‌ల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ నిరాకరించింది. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 (2023) ను ఒమన్, కువైట్, ఖతార్‌లలో నిషేధించారు. ది కాశ్మీర్ ఫైల్స్ (2022) ను అనేక గల్ఫ్ రాష్ట్రాల్లో నిషేధించారు.

Tags:    

Similar News