• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంటి కోసం కలుస్తున్న...

ఇంటి కోసం కలుస్తున్న చరణ్-బన్నీ?

By - Tupaki Desk
Update: 2017-10-01 04:23 GMT
దువ్వాడ జగన్నాథమ్ అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమా నాపేరు సూర్యపైనే ఫోకస్ మొత్తం పెట్టాడు. నా ఇల్లు ఇండియా అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. భక్తి ప్రబోధాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మెగా అభిమానులను మురిపించేలా ఈ సినిమాలో మరో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

నాపేరు సూర్య సినిమా కథను మలుపు తిప్పే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడనేది టాక్. ఈ సినిమాను నిర్మిస్తోంది నాగబాబు. బాబాయి నిర్మిస్తున్న సినిమా కావడంతోపాటు హీరో కూడా అల్లు అర్జున్ కావడంతో  ఈ పాత్ర చేయడానికి రామ్ చరణ్ సుముఖంగా ఉన్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. రామ్ చరణ్ ధృవ సినిమా కోసం కసరత్తులు అవీ బాగా చేసి బాడీ బాగా బిల్డప్ చేశాడు. ఆ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ బాగా మెప్పించాడు. ఈ లుక్ ఆర్మీ ఆఫీసర్ గా కూడా బాగా నప్పుతుంది. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం-1985 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం గడ్డం బాగా పెంచాడు. దాంతో రంగస్థలం పూర్తయిన తర్వాత నా పేరు సూర్యలో యాక్ట్ చేసే అవకాశం ఉంది.

ఇంతకుముందు రామ్ చరణ్ - అల్లు అర్జున్ కలిసి పైడిపల్లి వంశీ డైరెక్షన్ లో ఎవడు సినిమాలో నటించాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ హీరో కాగా.. అల్లు అర్జున్ స్పెషల్ రోల్ చేశాడు. ఆ పాత్ర సినిమాకు బాగా ప్లస్సయ్యింది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు కూడా రామ్ చరణ్ స్పెషల్ అప్పియరెన్స్ అట్రాక్షన్ అవుతుందని నాపేరు సూర్య యూనిట్ వర్గాలు అంటున్నాయి.
Tags:    
  • Ram Charan 
  • Allu Arjun 
  • Naa Peru Surya Movie 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS