భరత్ అనే నేను.. చెర్రీ కామెంట్స్!

Update: 2018-04-24 18:00 GMT
భరత్ అనే నేను సినిమా కలెక్షన్స్ ఏ స్థాయిలో వసూలు చేస్తుందో గాని సినీ ప్రముఖులు మాత్రం సినిమా అదిరిపోయింది అనేలా ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న మహేష్ కళ్లలో నిజమైన ఆనందం వర్ణనాతీతం. దానికి తోడు అందరూ చాలా బాగా చేశావ్ అని మరి మరి ప్రశంసలు అందించడంతో సూపర్ స్టార్ మరింత సంతోషిస్తున్నారు. ఇప్పటికే సినిమా కలెక్షన్స్ ఊహించని విధంగా అందుతున్నాయి.

ఇకపోతే తారక్ రాజమౌళి వంటి ప్రముఖులు సినిమా చాలా బావుందని పొగిడారు. ఎవరి స్టైల్ లో వారు సూపర్ స్టార్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపగా అదే రూట్ లో ఇప్పుడు రామ్ చరణ్ కూడా తనదైన శైలిలో భరత్ అనే నేను సినిమాపై స్పందించాడు. క్లాసిక్ ఫిల్మ్ అనడానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. ప్రిన్స్ మహేష్ బాబు పర్ఫామెన్స్ పవర్ఫుల్ గా ఉంది. అందమైన కథను దర్శకుడు కొరటాల శివ గారు కరెక్ట్ గా తెరకెక్కించారు.

ఇక దేవి సూపర్ మ్యూజిక్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలరించింది. ఔట్ స్టాండింగ్ ఎంట్రీ ఇచ్చినందుకు హీరోయిన్ కైరా అద్వానీకి శుభాకాంక్షలు. ఇక మంచి సినిమాను నిర్మించిన డివివి.దానయ్య గారికి కూడా కంగ్రాట్స్ అంటూ.. మొత్తంగా భరత్ అనే నేను సినిమా చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తున్నట్లు రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.
Tags:    

Similar News