పెళ్లి విషయంలో ఆ స్టార్ హీరో తుది నిర్ణయం?
పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరు పొందిన ఆ స్టార్ హీరో పెళ్లి వార్తల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరు పొందిన ఆ స్టార్ హీరో పెళ్లి వార్తల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఏ వేడుకకు హాజరైనా .. మీడియా మీట్లో కనిపించినా ? అతడికి ఎదురయ్యే మొదటి ప్రశ్న పెళ్లి ఎప్పుడు?. అయితే ఇప్పుడు ఆ హీరో వివాహం గురించి వచ్చిన ఓ సంచలన వార్త సినీ వర్గాల్లో దుమారం రేపుతోంది. అతడు ఇకపై అసలు పెళ్లే చేసుకోకూడదని సంచలన తుది నిర్ణయానికి వచ్చినట్లు అతడి సన్నిహితుల నుంచి లీకైంది.
గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా? మీడియా ఎంతగా ప్రశ్నించినా ? ఆ స్టార్ హీరో పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. అయితే ఇటీవల తన అంతరంగికులు .. సన్నిహితులతో మాట్లాడే క్రమంలో జీవితంలో ఒంటరిగానే కొనసాగాలని.. వివాహ బంధంలోకి అడుగుపెట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛ, కెరీర్ పట్ల ఉన్న అంకితభావమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కాబోయే భాగస్వామి ఇలా ఉండాలి? పెళ్లి వేడుక అలా జరగాలి ? అని రకరకాల ఊహాగానాలు అల్లుకున్న అభిమానులకు ఈ వార్త ఊహించని పెద్ద షాక్ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఆ హీరో పెళ్లి రూమర్లను ట్రెండ్ చేసే ఫ్యాన్స్ ఈ లీక్డ్ న్యూస్‌తో నిరాశ తప్పదు. పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడై కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడ్డ అభిమానులకు ఇది మింగుడుపడని విషయంగా మారింది.
ఇండస్ట్రీలో బ్యాచిలర్‌గా మిగిలిపోయిన నటులు కొందరు ఉన్నా? కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే స్టార్ హీరో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం అరుదు. వివాహ బంధం వల్ల వచ్చే బాధ్యతల కంటే తన దృష్టంతా పూర్తిగా సినిమాలపైనే నిలిపి ప్రేక్షకులను అలరించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆ హీరో భావిస్తున్నట్లు కనిపిస్తుంది.
అయితే ఇప్పటివరకు ఈ ప్రచారంపై ఆ స్టార్ హీరో కానీ.. అతడి టీమ్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది కేవలం సన్నిహితుల మధ్య జరిగిన సంభాషణ నుంచి బయటకు వచ్చిన ప్రచారమా? లేక నిజంగానే అతడు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడా? అనేది చూడాలి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే అభిమానులు ఈ చేదు నిజాలను జీర్ణించుకోవడం కష్టమే.
ఆ స్టార్ హీరో పెళ్లి పీటలు ఎక్కడం లేదనే వార్త టాలీవుడ్‌తో పాటు మిగతా సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు మాత్రం ఇప్పటికీ అతడు తన నిర్ణయాన్ని మార్చుకుని త్వరలోనే మంచి శుభవార్త చెప్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.