• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ గురించి అరిస్తే చరణ్...

పవన్ గురించి అరిస్తే చరణ్ ఏమన్నాడు?

By - Tupaki Desk
Update: 2017-07-16 04:11 GMT
మెగా హీరోల సినిమాలకు సంబంధించిన వేడుకలైనా.. వాళ్లు పాల్గొనే వేరే సినిమాల ఫంక్షన్లయినా.. పవర్ స్టార్ నినాదాలు కామన్. ప్రతిసారీ వాళ్లను అడ్రస్ చేయడం.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అంటే ఇబ్బందికరమైన విషయమే. అలాగని పట్టించుకోకుండా సైలెంటుగా ఉంటే మరింత ఇబ్బంది తప్పదు. దీని చుట్టూ నెలకొన్న వివాదాల సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘దర్శకుడు’ సినిమా ఆడియో వేడుకకు వచ్చిన రామ్ చరణ్ కు కూడా పవన్ అభిమానుల తాకిడి తప్పలేదు. అతను మాట్లాడుతున్నంతసేపూ పవర్ స్టార్ నినాదాలతో ఆడిటోరియం హోరెత్తింది. చాలాసేపు ఓపిక పట్టిన చరణ్ చివరికి ఓ దశలో బాబాయి ప్రస్తావన తెచ్చాడు.

తన కుటుంబ సభ్యుల మీద ప్రేమ తన మనసులో ఉంటుందని.. అది వాళ్లకు తెలుసని.. దాన్ని తాను  ఇలాంటి వేదికల్లో బయటపెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు చరణ్. అభిమానుల్ని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నట్లుగా ఉంటూనే అదే సమయంలో వినమ్రంగానూ మాట్లాడటం ద్వారా కట్టె విరక్కుండా.. పాము చావకుండా అన్న తరహాలో వ్యవహరించాడు చరణ్. దీని కంటే ముందు సుకుమార్ గురించి చెబుతూ.. ఆయన తన ఫేవరెట్ డైరెక్టర్ అని.. ఆయనతో కొన్ని నిమిషాల్లోనే తాను కనెక్టయిపోయానని చెప్పాడు చరణ్. సుకుమార్ దగ్గరున్నఐడియాలన్నింటినీ సినిమాలుగా తీయాలంటే ఆయనకు ఒక జీవిత కాలం సరిపోదని.. కాబట్టే ‘సుకుమార్ రైటింగ్స్’ అనే బేనర్ పెట్టి మంచి పని చేశాడని చెప్పాడు చరణ్. సుక్కుతో పని చేస్తున్న ‘రంగస్థలం’ తనకు అద్భుతమైన అనుభవమని తెలిపాడతను. తన తండ్రి తనకు ఫ్లాట్ ఫాం ఇచ్చినప్పటికీ.. తనను హీరోగా నిలబెట్టిన ఘనత దర్శకులదే అంటూ తన డైరెక్టర్లందరినీ గౌరవించుకున్నాడు చరణ్.
Tags:    
  • Ram charan 
  • Pawan Kalyan Fans 
  • Darshakudu Audio Launch 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS