సైరా: చర్చలకు సిద్ధమనే మెగా సందేశం

Update: 2019-07-01 09:06 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై 'సైరా' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.  అయితే ఆదివారం నాడు రామ్ చరణ్ ఆఫీసు ముందు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు ధర్నా చేయడం ఒక హాట్ టాపిక్ అయింది.  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమాగా తీస్తున్నందుకు ప్రతిఫలంగా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని రామ్ చరణ్ మొదట్లో హామీ ఇచ్చారట.. కానీ ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అందోళన చేపట్టారు.  రామ్ చరణ్ ను కలవడానికి ప్రయత్నిస్తే చరణ్ మేనేజర్  తమను బెదిరిస్తున్నాడని కూడా వారు అంటున్నారు.  

ఈ విషయంపై స్పందించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రతినిథులు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులను బెదిరించడం నిజం కాదని అన్నారు. వారితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా వెల్లడించారు.  చారిత్రాత్మకమైన వ్యక్తులు మరణించిన 100 ఏళ్ళ తర్వాత సినిమా తెరకెక్కించే అవకాశం ఉంటుందని చెప్తూనే.. ఈ విషయం కోర్టులో ఉన్న కారణంగా ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపేందుకు తాము సిద్దంఅని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించే ఆలోచనలో ఉన్నట్టుగా వారు వెల్లడించారు.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.  ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల ధర్నా కారణంగా మెగా ఫ్యామిలీని వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చిదని.. ఈ ఇష్యూను సామరస్యపూర్వకంగా పరిష్కరించడం మేలని మెగా అభిమానులు కోరుతున్నారు.

 
 
Tags:    

Similar News