• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైరల్ పిక్స్ : చరణ్‌ అన్న...

వైరల్ పిక్స్ : చరణ్‌ అన్న ఎవరు ఈ బుడ్డోడు?

By - Tupaki Desk
Update: 2021-06-29 06:30 GMT
నిన్నంత సోషల్‌ మీడియాలో మెగా అభిమానులు ఈ ఫొటోలను తెగ షేర్‌ చేశారు. రామ్‌ చరణ్‌ చాలా స్టైలిష్‌ గా ఉన్నాడు. చరణ్‌ పక్కన ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా ఒక బుడ్డోడు మరింత స్టైలిష్‌ గా కనిపించేలా డ్రెస్ అప్‌ అయ్యి జేబులో చేయి పెట్టుకుని మరీ చరణ్‌ తో మాట్లాడుతూ కనిపించాడు. చరణ్‌ పక్కన నిల్చునే అవకాశం దక్కించుకున్న ఆ బుడ్డోడు ఎవరు అయ్యి ఉంటాడు.. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ లో ఆ బుడ్డోడికి ఏంటీ పని అంటూ చాలా మంది చాలా రకాలుగా సోషల్‌ మీడియాలో ప్రశ్నలు గుప్పించారు.

రామ్‌ చరణ్‌ ను ట్యాగ్‌ చేస్తూ పలువురు అన్న ఎవరు ఈ బుడ్డోడు భలే ఉన్నాడు అంటూ ప్రశ్నించారు. ఇక కొందరు అన్న మీరు కూడా త్వరగా బాబును కనండి.. అతడు ఈ బుడ్డోడు అంత క్యూట్‌ గా ఉంటాడు మేము అంతా కూడా అందుకోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. మొత్తంగా ఆ బుడ్డోడి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం ఆ బుడ్డోడికి వచ్చింది. సినిమాలోని కీలక సన్నివేశంలో అతడు కనిపించబోతున్నాడు. గతంలోనే ఒకసారి అతడిపై చిత్రీకరణ జరిగింది. మళ్లీ ఇప్పుడు అతడు రెండు రోజుల షూటింగ్‌ నిమిత్తం టీమ్ తో జాయిన్‌ అయ్యాడని యూనిట్‌ సభ్యుల సమాచారం.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటున్నారు. జులై చివరి వరకు ఈ సినిమాను పూర్తి చేసేందుకు ఆయన పట్టుదలతో ఉన్నాడు. సినిమా ను జనవరి లో రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకోసం జక్కన్న మొత్తం ప్యాచ్‌ వర్క్ తో సహా షూట్‌ ను ముగిస్తున్నాడు. అందుకే మొదట్లో షూట్ కు వచ్చిన వారు కూడా మళ్లీ రావాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఈ బుడ్డోడు మళ్లీ చరణ్‌ తో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నాడు.
Tags:    
  • Ramcharan 
  • Chiranjeevi 
  • RRR 
  • RRR Shooting 
  • Tollywood 
  • Telugu News 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS