టైటిల్ కోసం యుద్దం చేయమన్న చరణ్‌

Update: 2017-05-28 07:26 GMT
ఇప్పుడు రామ్ చరణ్‌ మరియు సుకుమార్ సినిమా.. షూటింగ్ నుండి సమ్మర్ బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతున్నప్పటికీ.. ఇంతవరకు సినిమా టైటిల్ ఏంటనేది మాత్రం తెలియదు. కేవలం %%% అని మాత్రమే ఈ సినిమాను పిలుస్తున్నాం. అయితే ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పిలుపునిచ్చాడు మెగా హీరో.

ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఒక సందేశాన్ని అందించిన చరణ్‌ ఫ్యాన్స్ ను యుద్దం చేయమంటున్నాడు. ''ఇప్పటివరకు సుకుమార్ గారు అసలు టైటిల్ ఏంటనేది చెప్పట్లేదు. ఆయన త్వరగా మన సినిమాకు టైటిల్ పెట్టాలని రిక్వెస్ట్ చేయండి. నాతో పాటు మీరు కూడా ఆయనకు ట్విట్టర్లో ఫేసుబుక్కులో టైటిల్ రివీల్ చేయమని రిక్వెస్టులు పెట్టండి. అలా హంగామా చేస్తే కాని ఆయన టైటిల్ చెప్పేలా లేడు. ఓ వారం ఓ 10 రోజులు తీసుకుని మన సినిమా టైటిల్ ఏంటో ఆయన దగ్గర నుండి రాబడదాం'' అంటూ చరణ్‌ వీడియో సందేశం పంపాడు.

సో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ ట్విట్టర్లో తమ యుద్దం మొదలెట్టేస్తున్నారు. మొత్తానికి టైటిల్ గురించే కాదు.. సినిమా గురించి కూడా భలే విధంగా అప్డేట్ ఇచ్చాడులే రామ్ చరణ్‌.


Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News