• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ సినిమాతో.. మాస్...

చరణ్ సినిమాతో.. మాస్ డైరక్టరే

By - Tupaki Desk
Update: 2017-06-18 07:48 GMT
మన రోజు వారి జీవనంలో సినిమా ప్రభావం చాలా ఉందని చెప్పవచ్చు. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో వేసుకున్న చొక్కా నుండి వాడే వస్తువు వరకు మాటలాడే మాట నుండి మన జీవితాన్ని చూసే విధానం వరకు అన్నింటి పైనా వాటి ప్రభావం ఉంటుంది. ప్రతి హీరో ప్రభావం ఎంతో కొంత మన యూత్ పై ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా రంగస్థలం 1985 కూడా అటువంటి గొప్ప ప్రభావమే చూపిస్తుంది అంటున్నారు సుకుమార్ అండ్ టీమ్.

సుకుమార్ ఇంతవరకు మాస్ ఎలిమెంట్స్ పెట్టి సినిమా తీయలేదు. ఎంచుకున్న ప్రతి సినిమా ముందు సినిమా కన్నా భిన్నంగా అప్పటి ట్రెండ్ కు కొత్తగా ఎంచుకొనేవాడు. ‘100% లవ్’ కానీ   ‘1 నేనొక్కడినే’ కానీ ఆ తరువాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ కానీ మనం పరిశీలిస్తే అన్నీ క్లాసిక్ టచ్ ఉండి కొన్ని వర్గాలు ప్రేక్షకులుకు మాత్రమే బాగా నచ్చే అంశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వస్తున్న రామ్ చరణ్ సినిమాలో వాటి అన్నింటిని పక్కన పెట్టి పూర్తి పల్లెటూరు కుర్రవాడు ఎలా ఉంటాడో ఎలా ఆలోచిస్తాడో అలా తీర్చిదిద్దారట. హీరో లుక్ కానివ్వండి.. కత నడిచే పద్దతి కాని.. ఇన్నాళ్ళూ ఒకలా ఉంటే ఇప్పుడు ఒకలా ఉంటుందట. ఈ సినిమాలో గెడ్డం తో నలిగిన చొక్కతో పైకి ఎత్తి కట్టిన లుంగీ తో కనిపించి అందరినీ ఆనందపరిచాడు. ఈ సినిమా విడుదల తరువాత  రంగస్థలం లుంగీ స్టైల్ ఒక ట్రేడ్ మార్క్ అవుతుందట. చరణ్  యాస, శైలి, అన్నీ చాలామంది పల్లెటూరు యువకులుకు ఫాలో అవ్వడానికి ఒక ట్రెండ్ దొరుకుతుంది అని చెబుతున్నారు. ఈ సినిమాతో క్లాస్ లో మాస్ ఉంటుంది మాస్ లో క్లాస్ ఉంటుంది అని రుజువు అయితే.. సుకుమార్ కూడా మాస్ డైరక్టర్ అయిపోయినట్లేనేమో.

రంగస్థలం సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. హీరో గా రామ్ చరణ్ హీరోయిన్ గా సమంత నటిస్తుండగా.. యాంకర్ అనసూయ ఒక ముఖ్యమైన రోల్ చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. రానున్న సంక్రాంతికి రంగస్థలం 1985ను వెండితెరపై చూడొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Ram Charan 
  • Ranghastalam 1985 

Similar News

సౌందర్య నాకు గట్టి పోటీ ఇచ్చింది.. రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-19 06:00 GMT

ప్రిన్స్ విలియం ముందు సైఫ్ అలీఖాన్ బోల్డ్ కామెంట్స్!

2026-11-19 05:36 GMT

కళ్ళుచెదిరే అందాలతో కియారా.. క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న కూతురు!

2026-11-19 05:32 GMT

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

ట్రెండింగ్: స‌మంత త‌ర్వాత జెన్-Z లేడీ బాస్?

2026-11-19 05:01 GMT

8 కిలోల గజ్జెలతో శ్రద్ధా కపూర్ సాహ‌సం.. లావణి నృత్యం అంత క‌ష్ట‌మా?

2026-11-19 05:01 GMT

ఖ‌రీదైన ప‌చ్చ‌ల హారంతో మ‌హారాణినే త‌ల‌పించింది!

2026-11-19 05:01 GMT

టైసన్ నాయుడు టీజర్.. ఓల్డ్ సిటీలో ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్

2026-11-19 04:56 GMT

'ఆకాశంలో ఒక తార' USA థియేటర్స్ లిస్ట్

2026-11-19 04:05 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

Copyright @2026

Powered by Blink CMS