• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేరళలో చరణ్ మేనియా...

కేరళలో చరణ్ మేనియా మామూలుగా లేదుగా..!

By - Tupaki Desk
Update: 2021-12-29 16:53 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ''ఆర్.ఆర్.ఆర్'' అనే భారీ మల్టీస్టారర్ లో నటించిన సంగతి తెలిసిందే. 2022 జనవరి 7న ఈ యాక్షన్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో చెర్రీని చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బిగ్ స్క్రీన్ మీద రామరాజు గర్జన చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం RRR టీమ్ తో కలిసి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఇతర ఇండస్ట్రీలలో కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదనే విషయాన్ని నిరూపిస్తున్నాయి. మెగా వారసుడు ఇప్పటికే పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడనడానికి ఇవి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

చెర్రీ సినిమాలకు తమిళనాడు - కర్ణాటకలలో నుంచి క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. బెంగుళూరులో జరిగిన ప్రెస్ మీట్ మరియు చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కడ రామ్ చరణ్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియజేశాయి. అలానే ముంబైలో జరిగిన RRR ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు చరణ్ ఫ్యాన్స్ బారికేడ్లను బద్దలు కొట్టి మరీ వచ్చారంటే నార్త్ లో అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు కేరళ వంతు వచ్చింది.

'ఆర్.ఆర్.ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం కేరళలోని తిరువనంతపురంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకకు రామ్ చరణ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. చెర్రీ ఫోటోలు కటౌట్ లు పట్టుకొని మలయాళ సాంప్రదాయ వాయిద్యాలతో ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకున్నారు. 'జై చరణ్.. జై జై చరణ్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలానే మలయాళంలో కూడా కొన్ని స్లోగన్స్ చేశారు.

ఇందులో RRR చిత్రంలో రామ్ చరణ్ కనిపించే మూడు గెటప్స్ కు సంబంధించిన కటౌట్ లను ప్రదర్శించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏదేమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కేరళ అంతటా చరణ్ మేనియా కొనసాగిందనేది అర్థం అవుతోంది. అక్కడ కనిపించిన సందడి వాతావరణం చూస్తే.. మాలీవుడ్ లోనూ మెగా పవర్ స్టార్ సత్తా చాటుతారని స్పష్టంగా తెలుస్తుంది.

ఇప్పుడు RRR ఈవెంట్ సందర్భంగా కేరళలో రామ్ చరణ్ ఫ్యాన్స్ చేసిన హంగామాకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి 'కేరళ అడ్డా.. రామ్ చరణ్ అడ్డా' అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో చరణ్ అంటే ఏంటో నేషనల్ వైడ్ చాటి చెప్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే రామ్ చరణ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ అవ్వకముందే.. తదుపరి ప్రాజెక్ట్స్ కు రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. శంకర్ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో చేస్తున్న సినిమాను దేశ వ్యాప్తంగా పలు ప్రధాన భాషల్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో సుకుమార్ తో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్లు స్పష్టత వచ్చేసింది. ఇదంతా చూస్తుంటే RRR తర్వాత పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని కాపాడుకునేలా.. చరణ్ అడుగులు వేస్తున్నారనేది అర్థం అవుతోంది.
Tags:    
  • Ram Charan Mania 
  • Kerala 
  • RRR event 
  • rrr malayalam 
  • mollywood 
  • ram charan kerala fans 
  • mega power star 
  • jr ntr 
  • rrr movie 
  • rajamouli 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS