• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆచార్య'లో రాంచరణ్ భాగం...

'ఆచార్య'లో రాంచరణ్ భాగం ఉంది: మాట్నీ సంస్థ

By - Tupaki Desk
Update: 2020-03-21 10:45 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. మెగాస్టార్ కెరీర్ లో 152వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా పై సినీ వర్గాలలో, మెగా అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో టాప్ డైరెక్టర్ స్థానంలోకి చేరాడు. తన ప్రతి సినిమాలో ఏదొక సందేశంతో మాస్-క్లాస్ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తూనే ఉన్నాడు కొరటాల. ఇటీవలే 'సైరా నరసింహరెడ్డి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ 'ఆచార్య'తో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నాడు.

అయితే ఆచార్య సినిమా షూటింగులో ఉండగానే.. సినిమా గురించి చర్చలు, వివాదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆచార్య సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ నుండి ఆచార్య సినిమా నిర్మాణానికి రాంచరణ్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదని, మొత్తం ప్రొడక్షన్ అంతా మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారే చూసుకుంటున్నారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాను రాను ఇలాంటి వార్తలు సినిమాను దెబ్బతీసేలా ఉన్నాయని మాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ ఈ విషయం పై స్పందించింది.

"ఆచార్య సినిమా నిర్మాణంలో మాట్నీ ఎంటర్టైన్మెంట్ వారి బడ్జెట్ ఎంత ఉందో కొణిదెల ప్రొడక్షన్స్ వారిది కూడా అంతే ఉందని తెలిపారు. అంతేగాక ప్రతి ఖర్చులోను నిర్మాత రాంచరణ్ తమతో సగం ఖర్చును షేర్ చేసుకుంటున్నట్లు వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని, ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టించే వారికి సమాధానం దొరికిందని భావిస్తున్నట్లు" మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి స్పందించాడు.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Box Office 
  • acharya 
  • chiranjeevi 
  • ram charan 
  • matinee entertainments 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS