• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్ : సూపర్ క్లిక్...

ఫొటోటాక్ : సూపర్ క్లిక్ చరణ్ బ్రో

By - Tupaki Desk
Update: 2021-11-15 08:26 GMT
రామ్ చరణ్‌ ఇన్ స్టా గ్రామ్ లో చాలా రేర్ గా ఫొటోలు షేర్‌ చేస్తూ ఉంటాడు. ఆయన ఫొటోలు ఏవి షేర్ చేసినా కూడా అవి ఖచ్చితంగా స్పెషల్ గా ఉండటం లేదా ఏదో ఒక విశేషం ఉంటేనే షేర్‌ చేస్తూ ఉంటాడు. తాజాగా రామ్‌ చరణ్‌ ఈ ఫొటోను షేర్ చేశాడు. చరణ్‌ విండో వద్ద నిల్చుని సూర్యోదయంను ఆస్వాదిస్తున్న సమయంలో ఇలా షాడో పడటం.. ఆ షాడో చాలా విభిన్నంగా కళ్లపై అడ్డంగా.. బాడీ పై నిలువుగా పడటం యూనిక్‌ గా అనిపించింది. అందుకే వెంటనే చరణ్‌ ఫోన్ తీసుకుని సెల్ఫీ కొట్టేశాడు. కళ్ల వరకు షాడో ఉండటం ఫేస్ మొత్తం చాలా యూనిక్ గా కనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటివి చాలా ఎక్స్ పర్ట్స్ అయిన కెమెరా మెన్స్ మాత్రమే తీయగలరు అని.. చరణ్‌ కు ఉన్న ఫొటో గ్రఫీ అలవాటుతో ఈ క్లిక్ చేశాడంటూ కొందరు చెబుతుంటే మరి కొందరు చరణ్‌ ఫొటోగ్రఫీ స్టైల్‌ కు ఫిదా అవుతున్నారు. సూపర్ బ్రో ఇలాంటి యూనిక్ ఐడియాలతో ముందు ముందు మరిన్ని ఫొటోలు మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చరణ్‌ ఈ ఫొటోకు క్యాప్షన్ ఏమీ పెట్టకుండానే సింపుల్ గా షేర్ చేశాడు. కాని అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఈ ఫొటోకు కామెంట్స్.. క్యాప్షన్స్ ఇచ్చేస్తున్నారు. చరణ్‌ షేర్ చేసిన ఈ ఫొటో ఇన్‌ స్టా లో తెగ షేర్‌ అవుతోంది.

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే తన 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. నేటి నుండి ఆ సినిమా రెండవ షెడ్యూల్‌ ప్రారంభం అయ్యింది. ఇక చరణ్ వాయిస్‌ ఓవర్‌ చెప్పిన గని సినిమా టీజర్ కూడా తాజాగా విడుదల అయ్యింది. ఇక ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆర్‌ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్‌ కనిపించబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ నుండి చరణ్‌ లుక్ ఇప్పటికే రివీల్ అయ్యింది. ఇటీవల విడుదల అయిన నాటు నాటు పాట కూడా భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుని సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆ పాటలో చరణ్ మరియు ఎన్టీఆర్ ల డాన్స్ కు జనాలు ఫిదా అవుతున్నారు అనడంలో సందేహం లేదు.
Tags:    
  • rc15 
  • ramcharan 
  • ramcharan movies 
  • ramcharan rc15 
  • shankar 
  • ramcharan rc15 shooting 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS