• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాన్నతో చరణ్‌ గెస్ట్‌ కు...

నాన్నతో చరణ్‌ గెస్ట్‌ కు ఎక్కువ హీరోకు తక్కువ

By - Tupaki Desk
Update: 2020-02-04 04:20 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ రంగస్థలం చిత్రం షూటింగ్‌ జరుపుకున్న రంగస్థలం గ్రామం సెట్‌ లోనే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి చేస్తున్నారట. అక్కడే దాదాపుగా రెండు నెలల పాటు చిత్రీకరణ చేయబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చిరు మూవీలో చరణ్‌ అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పుడు ఈ పుకార్లలో ఇంకో అడుగు ముందుకు పడింది.

ఇన్ని రోజులు చిరంజీవి యంగ్‌ ఏజ్‌ పాత్రలో చరణ్‌ కనిపిస్తాడని.. ఇద్దరి కాంబోలో సీన్స్‌ ఉండవంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు మాత్రం ఇద్దరి కాంబోలో సీన్స్‌ ఉంటాయి. చిరంజీవి ఆచార్యగా కనిపిస్తే చరణ్‌ సిద్దు అనే పాత్రలో కనిపించబోతున్నాడు. వీరిద్దరి కాంబో సీన్స్‌ ను చాలా రహస్యంగా చివర్లో షూట్‌ చేసే ఉద్దేశ్యంలో దర్శకుడు ఉన్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్‌ వినిపిస్తుంది.

మెగా 152 చిత్రంలో చరణ్‌ ది కేవలం 15 నుండి 20 నిమిషాలు మాత్రమే ఉండే పాత్ర. అంటే చరణ్‌ చేయబోతున్నది గెస్ట్‌ రోల్‌ కు ఎక్కువ హీరో రోల్‌ కు తక్కువ. అయినా కూడా మెగా ఫ్యాన్స్‌ కు చిరు.. చరణ్‌ లను ఒకేసారి వెండి తెర పై చూస్తే పండుగే. ఆ పండుగ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అపజయం ఎరుగని కొరటాల శివ ఈ చిత్రంతో మరో బ్లాక్‌ బస్టర్‌ ను చిరంజీవి ఖాతాలో వేయడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. ఆగస్టులో లేదంటే దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.
Tags:    
  • Chiranjeevi 
  • Koratala Siva 
  • Chiru 152 
  • Trisha 
  • Koratala Shiva 
  • Ram Charan Tej 
  • Tupaki Updates 
  • Tupaki News 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS