అమెరికా స్టాక్స్ ఎక్స్ఛేంజ్ బిల్డింగ్‌ పై రామ్ చరణ్ కటౌట్!

Update: 2021-03-27 10:59 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 36వ బర్త్ డే సెల‌బ్రేష‌న్స్ మెమ‌ర‌బుల్ గా జ‌రుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అట్ట‌హాసంగా సాగుతున్న వేడుక‌లు.. విదేశాల‌కూ విస్త‌రించాయి. ఏకంగా అమెరికాలోని న్యూయార్క్ టౌన్ స్క్వేర్ వ‌ద్ద క‌ళ్లు చెదిరిపోయే రామ్ చ‌ర‌ణ్ క‌టౌట్ తో బ‌ర్త్ డే గ్రీటింగ్స్ వెలువ‌డ్డాయి. ఈ విష‌యం తెలుసుకున్న మెగా అభిమానుల ఆనందానికి హ‌ద్దుల్లేకుండా పోతున్నాయి.

శుక్ర‌వారం సాయంత్రం నుంచే మొద‌లైన చెర్రీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌.. శ‌నివారం నాటికి పీక్ స్టేజ్ కు చేరాయి. ఈ హ్యాపీ అకేష‌న్ లో చెర్రీకి శుభాకాంక్ష‌ల వెల్లువ కొన‌సాగుతోంది. రెండు రోజులుగా ఈ గ్రీటింగ్స్ జ‌డిలో త‌డిసిముద్ద‌వుతున్నాడు రామ్ చ‌ర‌ణ్‌.

కాగా.. ఏకంగా అమెరికాలోని నాస్డాక్ బిల్డింగ్ గా పిలిచే అమెరికా స్టాక్స్ ఎక్స్ఛేంజ్ భ‌వ‌నంపై రామ్ చ‌ర‌ణ్ క‌టౌట్ ఆవిష్క‌రించి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. ఈ అత్యున్న‌త గౌర‌వానికి మెగా ఫ్యాన్స్ ఉప్పొంగి పోతున్నారు. గ‌తంలో బాలీవుడ్ బాద్షా షారూక్ క‌టౌట్ ను ప్ర‌తిష్టాత్మ‌క‌మైన దుబాయ్ బుర్జ్ ఖ‌లీఫా పై ఆవిష్క‌రించారు. ఇప్పుడు అలాంటి గౌర‌వం రామ్ చ‌ర‌ణ్ కు ద‌క్క‌డంతో ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా శుక్ర‌వారం సాయంత్రం RRRలోని అల్లూరి ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇవాళ ఉద‌యం ఆచార్య టీమ్ సిద్ధ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది. ఈ రెండు పోస్ట‌ర్ల‌లోని రామ్ చ‌ర‌ణ్ రూపం ఆక‌ట్టుకోవ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా క‌టౌట్ గురించి తెలియ‌డంతో గాల్లో తేలిపోతున్నారు. మొత్తానికి చెర్రీ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ అంబరాన్ని తాకేశాయి.
Tags:    

Similar News