• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్‌ కి ఎట్టకేలకు దానికి...

చరణ్‌ కి ఎట్టకేలకు దానికి టైమ్ దొరికిందట!

By - Tupaki Desk
Update: 2022-08-10 23:30 GMT
రామ్ చరణ్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల అయినప్పటి నుండి శంకర్ సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నాడు. వరుస షెడ్యూల్స్ తో చరణ్‌ కి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా శంకర్‌ షూటింగ్ పెట్టుకుంటూ వచ్చాడు.

తాజాగా రామ్ చరణ్ మరియు శంకర్ సినిమా కు చిన్న బ్రేక్ వచ్చిందని.. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 పనిలో పడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇండియన్‌ 2 సినిమా యొక్క నిర్మాతలతో జరిగిన ఒప్పందం మేరకు ఆ సినిమా కోసం శంకర్‌ రెండున్నర నుండి మూడు నెలల పాటు సమయం కేటాయించాల్సి ఉంది. ఆ సమయంలో బ్యాలెన్స్ షూటింగ్ ను ముగించి వెంటనే విడుదలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇప్పుడు శంకర్‌ అదే పనిలో ఉన్నాడు అంటూ తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రామ్ చరణ్ తో వరుసగా షెడ్యూల్‌ ల్లో షూటింగ్‌ చేసిన శంకర్ ఇప్పుడు ఇండియన్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు షూటింగ్ పునః ప్రారంభించే పనిలో ఉండటం వల్ల రామ్‌ చరణ్ కి కావాల్సినంత సమయం లభించినట్లు అయ్యింది. ఈ ఖాళీ టైమ్ ను రామ్‌ చరణ్‌ సద్వినియోగం చేసుకునేందుకు తన తదుపరి సినిమా స్క్రిప్ట్‌ వర్క్ లో పడ్డాడట.

ఇప్పటికే రామ్‌ చరణ్ తదుపరి సినిమా కు జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నాడని.. ఆయన స్టోరీ లైన్ చెప్పగా ఓకే చెప్పాడని.. ఇప్పుడు స్క్రిప్ట్‌ ను పూర్తి చేసేందుకు గాను చరణ్‌ తో గౌతమ్‌ సిట్టింగ్స్ వేస్తున్నాడని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రామ్ చరణ్‌ కేవలం గౌతమ్ తిన్ననూరితో మాత్రమే కాకుండా మరి కొందరు నిర్మాతలు మరియు దర్శకులతో కూడా ఈ గ్యాప్ లో భేటీ అవ్వబోతున్నాడు. కొత్త సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ చర్చలు.. ఇతర చర్చలను కూడా ఆయన జరుపబోతున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Ramcharan 
  • Shankar 
  • RC15 
  • Rc15shortbreak 
  • Socialmediaviral 
  • Indian2 
  • Indian2shoot 
  • Movienews 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS