సల్మాన్ తో మెగా చిల్ అవుట్..!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ క్రేజ్ ఎప్పుడూ పీక్స్ లోనే ఉంటుంది. సినిమాలతో బ్లాక్ బస్టర్లు సాధించడంతో పాటుగా సల్మాన్ టీవీ కార్యక్రమాలకు హోస్టుగా వ్యవహరిస్తారు. వీటితో పాటుగా లైవ్ ఈవెంట్లలో భాయ్ రచ్చ మామూలుగా ఉండదు. నిన్న రాత్రి సల్మాన్ ఖాన్ 'ద బాంగ్ టూర్' లోగ్రాండ్ ఫినాలే షో హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియం లో జరిగింది. ఈ షోకు సల్మాన్ తో పాటుగా సోనాక్షి సిన్హా.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. సింగర్ గురు రాంధ్వా కూడా హాజరై తమ లైవ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అయితే ఈ కార్యక్రమం కంటే కూడా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది మాత్రం షో తర్వాత సల్మాన్ మెగా మీటింగ్. షో పూర్తయిన తర్వాత రామ్ చరణ్.. అల్లు అర్జున్.. అల్లు అరవింద్ లను సల్మాన్ ఖాన్ పార్క్ హయత్ హోటల్ లో కలిశారట. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారని సమాచారం. చరణ్ తో సల్మాన్ చాలా క్లోజ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలా చరణ్ తో కలిసి ముచ్చటించుకునే సందర్భమే వచ్చింది. ఈసారి ఆ మీటింగ్ లో బన్నీ..అరవింద్ గారు కూడా ఉన్నారు. అయితే ఈ మీటింగ్ లో ఏదో ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయని కూడా కొన్ని ఊహాగానాలు వచ్చాయి కానీ అలాంటిదేమీ లేదట. ఇదో క్యాజువల్ మీటింగ్ మాత్రమేనట.
ఈమధ్య సల్మాన్ సినిమాల తెలువు వెర్షన్లకు చరణ్ తనవైపు ప్రచారం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ కు సంబంధించిన ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్లను చరణ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తారు. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' తెలుగు వెర్షన్ లో సల్మాన్ కు చరణ్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. సల్మాన్ కూడా చరణ్ పై అదేరకమైన అభిమానాన్ని చూపిస్తుంటారు