బన్నీ జాక్సన్‌ వర్సెస్‌ చరణ్‌ లీ

Update: 2015-08-31 13:49 GMT
మెగా హీరోలు చరణ్‌, బన్ని ఈ ఇద్దరూ టాలీవుడ్‌ లో బాక్సాఫీస్‌ కింగ్‌ లుగా పేరు తెచ్చుకున్నారు. సునాయాసంగా 50కోట్ల వసూళ్లు తెచ్చే సత్తా ఉన్న హీరోలుగా ట్రేడ్‌ లో టాక్‌ ఉంది. అందుకే ఈ ఇద్దరూ ఏ సినిమా చేస్తున్నా ఆ సినిమా గురించిన ఆసక్తికర చర్చ సాగుతుంది. ముఖ్యంగా అభిమానుల్లో ఈ ఇద్దరి గురించి ఎప్పటికప్పుడు డిబేట్‌ నడుస్తూనే ఉంటుంది.

చరణ్‌ తాజా చిత్రానికి బ్రూస్లీ అనే టైటిల్‌ నిర్ణయించినప్పట్నుంచి ఒకటే డిష్కసన్‌. పైగా చరణ్‌ మోచేతిపై బ్రూస్లీ టాట్టూ ఫ్యాన్స్‌ ని వెర్రెత్తిస్తోంది. ఇండియన్‌ సినిమా హిస్టరీ లోనే ఇలాంటి యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కలేదు. నా అభిమాన బ్రూస్లీకి ఇదే నా కానుక.. అంటూ చరణ్‌ ఎంతో ఉద్వేగంగా వైట్లతో సినిమా గురించి మాట్లాడాడు. అంటే చరణ్‌ బ్రూస్లీని ఓ అభిమానిగా ప్రమోట్‌ చేస్తున్నాడు.

ఇంతకుముందే బన్ని కూడా ఇదే తరహాలో హాలీవుడ్‌ పాప్‌ స్టార్‌ మైకేల్‌ జాక్సన్‌ కి అభిమానిని అని ప్రకటించాడు. అతడికి ట్రైబ్యూట్‌ గా జాక్సన్‌ స్టెప్పులు అంటూ సౌత్‌ స్కోప్‌ అవార్డు వేడుకల్లో అదరగొట్టేశాడు. చరణ్‌ బ్రూస్లీని ఇన్‌ స్పిరేషన్‌ గా తీసుకుని యాక్షన్‌ లో అదరగొట్టేస్తుంటే, బన్ని జాక్సన్‌ ని ఆదర్శంగా తీసుకుని డ్యాన్సుల్లో ఇరగదీస్తున్నాడు. అది వీళ్లు నటించే ప్రతి సినిమాలో ప్రతిబింబిస్తూనే ఉంది. అంతటి పట్టుదల ఉన్నవారు కాబట్టే ఇంతటివారయ్యారన్నమాట!
Tags:    

Similar News