ప్రియుడితో రకుల్ సీక్రెట్ సెలబ్రేషన్స్..!
2021 కి టాటా చెప్పి 2022కి వెల్ కం చెప్పాం! సెలబ్రిటీ ప్రపంచం విదేశీ విహార యాత్రలను ఆస్వాధించారు. `న్యూ ఇయర్` వేడుకల్ని ముగించుకుని బాలీవుడ్ భామలు ఒక్కొకరుగా ముంబైకి చేరుకుంటున్నారు. మళ్లీ రెగ్యులర్ లైఫ్ లో బిజీ అవ్వడానికి రెడీ అవుతున్నారు. కొత్త ఏడాదిలోకి కోటి ఆశలతో అడుగులు పెట్టి కలిసి రావాలని .. కెరీర్ ని చక్కగా మలుచుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా న్యూ ఇయర్ వేడుకల్ని ముగించి ముంబై ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమైంది. అయితే ఆమె ఒంటరిగా కాదు. ఈసారి ప్రియుడితో కలిసి ఎయిర్ పోర్ట్ సీసీ కెమెరాల్లో చిక్కుకుంది. కొత్త సంవత్సరం వేడుకుల్ని ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి లండన్ లో సెలబ్రేట్ చేసుకుంది.
2022 ఎన్.వై.ఇ వేడుకలకు ఈ జంట రెండు రోజుల ముందుగానే లండన్ చేరుకుంది. అన్ లిమిటెడ్ సెలబ్రేషన్స్ ని ఓవైపు ఆస్వాధిస్తూనే ఇతర పనుల్ని చక్కబెట్టుకుని తిరుగు ప్రయాణంలో ఇలా ఎయిర్ పోర్టులో జంటగా కనిపించారు. ఇక రకుల్ కెరీర్ కూడా బాలీవుడ్ లో ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ చాలా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. టాలీవుడ్ లో ఛాన్సులు తగ్గుతున్న క్రమంలో తెలివిగా బాలీవుడ్ లో అవకాశాలు ఒడిసిపడుతోంది. ఇక ప్రియుడు జాకీ భగ్నానీ ఓ నిర్మాత కుమారుడు కావడం రకుల్ కలిసొస్తుందనే టాక్ ఉంది.
జాకీ కుటుంబానికి బడా వ్యాపారాలున్నాయి. అయినా జాకీ సినిమాల్లో రాణించాలని ఆశపడుతున్నాడు. ప్రియురాలి సహకారం కూడా తోడైంది కాబట్టి ఇద్దరు జంటగా హిందీలో లైఫ్ ని డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రకుల్ -శంకర్ దర్శకత్వంలో `ఇండియన్-2` లో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.