ఆ ట్రైనర్ దగ్గర చేరిన రకుల్
సినిమా కోసం ఈ రోజుల్లో కెమెరా ముందుకు వచ్చి ఎలా పడితే అలా మీసం తిప్పి తొడగొడితే చెల్లడం లేదు. చూసేవాళ్ళు కామెడీ అనుకుంటున్నారు. కథకు తగ్గట్టుగా హీరో మంచి ఫిట్నెస్ తో కనిపిస్తేనే కథలో సరైన కథానాయకుడు అంటున్నారు. హీరోయిన్స్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే మారింది. కథలో అందరు ప్రత్యేకంగా ఫీల్ అవ్వాలంటే అందమైన ఫిజిక్ ని మెయింటెన్ చేయాలి. అందంలో ఏ మాత్రం తేడా వచ్చినా అవకాశాలు తెలియకుండానే చేజారిపోతాయి.
దీంతో సినిమాలు ఎలా ఉన్నా కూడా హీరోయిన్స్ సరికొత్తగా కనిపిస్తున్నారు. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. అమ్మడు వచ్చినప్పటి నుంచి ప్రతి సినిమాలో చాలా అందంగా కనిపించింది. అయితే కొన్ని రోజులుగా రకుల్ ఎక్కువగా జిమ్ లోనే గడుపుతోంది. కొన్ని రోజుల్లోనే అమ్మడు ఒంట్లో ఉన్న ఫ్యాట్ ని మొత్తం కరిగించేసుకుంది. దాదాపు 9 కిలోల బరువు తగ్గిందట. చివరిగా అయ్యారి సినిమాలో లుక్ కి ఇప్పుడు ఉన్న లుక్ కి చాలా తేడా కనిపిస్తోంది. రకుల్ ట్రైనింగ్ తీసుకుంది రానా ఫెవేరేట్ జిమ్ ట్రైనర్ కునాల్ గిర్ దగ్గర. కునాల్ బాహుబలి కోసం ఇద్దరి హీరోలను భారీగా తయారుచేసిన సంగతి తెలిసిందే. ఇక రకుల్ కూడా తొందరగా అందాలను మార్చాలని ఆ ట్రైనర్ దగ్గరికే వెళ్లిందట.
రకుల్ ఇంతలా మారడానికి కారణం ఏమిటంటే.. అమ్మడు బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో ఒక సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కొంచెం డిఫెరెంట్ క్యారెక్టర్ అవ్వడంతో దర్శకుడు వెయిట్ తగ్గాలని చెప్పడట. అందుకోసం రకుల్ కష్టపడిందట.అది సంగతి.