అబ్బే రకుల్ ఇంకా ఒప్పుకోలేదట..

Update: 2018-06-26 04:12 GMT
నిన్నటి దాకా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు స్టార్ హీరోలందరి పక్కన ఫస్ట్ ఛాయిస్ గా రకుల్ పేరే వినిపించింది. ఉన్నట్టుండి ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు లేకుండా పోయాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన స్పైడర్ తరవాత ఆమె ఇంతవరకు తెలుగులో ఏ మూవీలోనూ నటించడానికి ఓకే చెప్పలేదు.

ఈ టైంలో రకుల్ కు ఐటం సాంగ్ కు ఆఫర్ వచ్చింది. పాపం రకుల్ కెరీర్ లో ఎప్పుడూ హీరోయిన్ రోల్ తప్ప ఐటం సాంగ్ చేసిన దాఖలాల్లేవు. అయితే ఈ ఆఫర్ వచ్చిందేమో డైరెక్టర్ బోయపాటి శ్రీను నుంచి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీస్తున్న సినిమాలో ఆమెతో ఐటం సాంగ్ చేయించాలన్నది బోయపాటి ఐడియా. ఆఫర్ బాగానే ఉన్నా రకుల్ ఇంకా ఊగిసలాటలోనే ఉంది. అసలే కెరీర్ బండి సరిగ్గా సాగడం లేదని దిగాలు పడుతుంటే ఇప్పుడు ఐటం సాంగ్ చేస్తే క్రేజ్ మరింత తగ్గిపోతుందని అనుమానపడుతోందట.

మరోవైపు రామ్ చరణ్ అండ్ బోయపాటి శ్రీనుతో రకుల్ మంచి రిలేషన్ షిప్ ఉంది. వాళ్లిద్దరితో చెరో రెండు సినిమాల్లోనూ ఆమె నటించింది. తిరిగి బౌన్స్  బ్యాక్ అవడానికి ఐటం సాంగు ఐడియా వర్కవుట్ అవుతుందా లేదా అన్న డౌట్ పై రకుల్ కు ఇంకా క్లారిటీ రాలేదు.  అందుకే అవునని.. కాదని ఏదీ చెప్పకుండా బోయపాటి టీంను వెయిటింగ్ లోనే ఉంచిందని తెలుస్తోంది. ఏదో ఒకటి తేల్చేస్తే బెటరమో రకుల్.
Tags:    

Similar News