రకుల్ .. మ‌రీ ఇంత క‌ళాత్మ‌కంగానా!

Update: 2022-01-04 16:30 GMT
క‌ళ‌ను క‌ళ‌తోనే గెల‌వాలి. క‌ళాత్మ‌కంగా మ‌న‌సుల్ని గెల‌వాలి. ఈ రెండిటిలో అరుదైన ప్ర‌తిభ‌ను సొంతం చేసుకుంది కాబ‌ట్టే ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్ప‌టికీ సౌత్ ని ఏల్తోంది. ఈ దిల్లీ బ్యూటీ ఆరంభం కెరీర్ ని నిల‌బెట్టుకునేందుకు చాలానే శ్ర‌మించాల్సి వ‌చ్చింది. సందీప్ కిష‌న్ లాంటి చిన్న హీరోతో వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ హిట్ కొట్టాక అగ్ర హీరోలు వెంట‌నే ఆఫ‌ర్లు ఇవ్వ‌లేదు. కాల‌క్ర‌మంలో చ‌ర‌ణ్‌- మ‌హేష్- ఎన్టీఆర్ లాంటి స్టార్లు అవ‌కాశాలు క‌ల్పించారు. ఆ త‌ర్వాత కెరీర్ ఒక్క‌సారిగా ఊపందుకుంది.

ఇటీవ‌ల తెలుగు-త‌మిళం-హిందీలోనూ వ‌రుస సినిమాలు చేస్తోంది. యువ‌హీరోల‌కు ఒక ఆప్షన్ గా కొన‌సాగుతోంది. మొన్న‌టికి మొన్న వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న న‌టించిన కొండ‌పొలం ఫ్లాప్ గా నిల‌వ‌డం త‌న‌కు ఒక ర‌కంగా మైన‌స్ అని చెప్పాలి. ప్ర‌స్తుతం భార‌తీయుడు 2లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక నాయిక‌గా న‌టిస్తోంది. ర‌కుల్ పై ఇప్ప‌టికే శంక‌ర్ కొన్ని స‌న్నివేశాల్ని కూడా చిత్రీక‌రించినా వివాదాల వ‌ల్ల వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు బాలీవుడ్ కెరీర్ పైనా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిన ర‌కుల్ దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకుంటోంది.  ఇటీవ‌ల తెలుగు క‌మిట్ మెంట్ల‌ను పూర్తి చేసుకుని అటు బాలీవుడ్ లో బిజీ అవుతోంది. ప్ర‌స్తుతం ర‌కుల్ బాలీవుడ్ లైన‌ప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకేసారి ఆరు హిందీ సినిమాలు చేస్తోంది. `ఎటాక్`..`ర‌న్ వే 34`..`ధాంక్ గాడ్`..`డాక్ట‌ర్ జీ`..` మిష‌న్ సిండ్రెల్లా`..`చాట్రీవాలై` లో న‌టిస్తోంది. ఇవ‌న్నీ షూటింగ్ కూడా పూర్త‌య్యాయి.  కొత్త సంవ‌త్స‌రంలో బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కానున్నాయి. గ‌తంలో బాలీవుడ్ లో రెండు..మూడు సినిమాలు చేసింది. అవేమి పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. అయినా ర‌కుల్ వాటితో సంబంధం లేకుండా అవ‌కాశాలు అందుకుని ఉత్త‌రాదిన బిజీ అయ్యింది. వ‌చ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఆ చిత్రాలు స‌క్సెసైతే హిందీ కెరీర్ కి  తిరుగుండ‌దు. ర‌కుల్ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ ఎంతో క‌ళాత్మ‌కంగా ఆక‌ట్టుకుంది. అందాల్ని ఎంతో అందంగా ప్రెజెంట్ చేసిన తీరుకు యూత్ ప్ర‌శంస‌లు కురిపిస్తోంది.
Tags:    

Similar News