ఫస్ట్ లుక్: రొమాంటిక్ జలేబి

Update: 2018-09-04 05:38 GMT
ఎండాకాలం అని.. వానాకాలం అని చలికాలం అని ఎన్నో రకాలా కాలాలున్నాయి గానీ మూతి ముద్దుల కాలం లిప్పు లాకుల సీజన్ అనే పేరుతో ఒక్కటి లేదేంటబ్బా.. ?  మనకిలాంటి ట్రెడిషన్ లేనందుకు ఫిలింమేకర్స్ కు కాస్త బాధగా ఉందేమో గానీ మూదొందలా అరవై ఐదు రోజులూ మూతి ముద్దులతో ప్రేమ హద్దులు చెరిపేస్తూ సభ్య సమాజంలోని ప్రేక్షకులకు శృంగార సందేశాన్ని ఇస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ లో లిప్పు లాకుల డ్యామ్ గేట్లు ఎత్తడంతో సెన్సారు వారు కూడా ఆ వరదలో తడిసి ముద్దవుతున్నారు. ధారాళంగా వాటిని ప్రేక్షకులు చూసేందుకు అనుమతిస్తున్నారు. ఇక మనకు ఈ లిప్పు లాకుల గోలను తగిలించిన బాలీవుడ్ వాళ్ళు ఇంకా దూరం వెళ్ళారు.  రీసెంట్ గా 'జలేబి' అనే హిందీ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.  ఆ ఫస్ట్ లుక్ లో హీరో వరుణ్ మిత్రా కు హీరోయిన్ రియా చక్రబర్తి ట్రైన్ ఎమెర్జెన్సి విండో నుండి కిందకు వాలి గాలి లో లిప్పు లాకు ఇచ్చింది.  అది ఎలా ఉంది అంటే ఇక అన్నీ రైల్వే స్టేషన్ లో ఫ్యూచర్ లో శృంగార సామ్రాజ్యాలుగా మారిపోయినా ఆశ్చర్యం లేదు. ఇక ఈ చుమ్మా చుమ్మా దేదే ట్రెండ్ ఒక కికి ఛాలెంజ్ లాగా మారుతుందేమో!

మరో వైపు ఈ ఫస్ట్ లుక్ మన టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు తెగ నచ్చింది.  ఈ ఫస్ట్ లుక్ ను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి "నా స్వీటెస్ట్ జలేబి రియా నేను విపరీతంగా ఎగ్జైట్ అయ్యాను.  నీ టైమ్ స్టార్ట్ అయింది బేబీ డాల్. జలేబి టీమ్ అందరికీ అల్ ద బెస్ట్ " అని క్యాప్షన్ పెట్టింది.  
Tags:    

Similar News