ఫస్ట్ లుక్: సోసో గా ఉన్న రీల్ శ్రీదేవి!

Update: 2018-10-10 04:51 GMT
నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ నుండి ఇప్పటికే పలువురు సెలబ్రిటీల ఫస్ట్ లుక్ లను క్రిష్ టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా అతిలోక సుందరి శ్రీదేవి పాత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రకుల్ శ్రీదేవి పాత్ర పోషిస్తోంది.

రకుల్ ఈ పోస్టర్ లో చాలా అందంగా ఉంది గానీ అతిలోక సుందరి శ్రీదేవిని మాత్రం మ్యాచ్ చేయలేకపోయింది. ఫ్రాంక్ గా చెప్పుకుంటే రీల్ శ్రీదేవి సోసోగానే ఉంది.  ఈ గెటప్ 'వేటగాడు' సినిమాలోని పాట కోసం అయి ఉండొచ్చు. క్రిష్ ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ఇతర పాత్రల ఫస్ట్ లుక్స్ విషయంలో ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నాడు గానీ శ్రీదేవి ఫస్ట్ లుక్ విషయం మాత్రం యావరేజ్ మార్కులే.  అయినా ఫస్ట్ లుక్ మాత్రమే చూసి మనం ఇలా డిసైడ్ చేయడం కరెక్ట్ కాదేమో.. సినిమా రిలీజ్ అయిన తరవాత బాలయ్య - రకుల్ ఆకులు పిందెల చాటున తడుస్తూ చేసే అల్లరిని చూసి అప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుంది.

'ఎన్టీఆర్' ఇప్పుడు 'కథానాయకుడు'.. 'మహానాయకుడు' కాబట్టి మొదటి భాగంలోనే శ్రీదేవి పాత్ర ఉంటుంది. అంటే జనవరి 9 న రీల్ శ్రీదేవి అల్లరి.. ఎన్టీఆర్ మార్క్ బాలయ్య స్టెప్పులు చూసేందుకు రెడీ అవ్వండి.


Tags:    

Similar News