లండన్ లో ఇద్దరు ముద్దుగుమ్మలు

Update: 2017-07-20 11:33 GMT
ఓ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారంటే.. ఆ ఇద్దరూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం అనే కల్చర్ గతంలో ఉండేది. ఇప్పుడు ఈ ట్రెండ్ లో కొంత మార్పు వచ్చింది కానీ.. పూర్తిగా సమసిపోలేదనే చెప్పాలి. ఇద్దరు ముగ్గురు చొప్పున కూడా హీరోయిన్స్ సినిమాల్లో నటించేస్తున్నారు కానీ.. ఆన్ స్క్రీన్ పై కనిపించినంత స్నేహంగా.. ఆఫ్ స్క్రీన్ లో కనిపించడం చాలా చాలా తక్కువ.

ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు కుర్ర భామలతో కలవడం మహా గగనం. ఎవరి టీం వారిదే అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. కానీ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మాత్రం ఈ విషయంలో కొత్త మార్పు చూపిస్తోంది. టాలీవుడ్ యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి భలే పోజ్ ఇచ్చేసింది. ఇంతకీ ఈ ఇద్దరు ఎక్కడ కలిశారు.. ఎందుకు కలిశారన్నదే మీ డౌట్ కదా.. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు లండన్ రోడ్లపై ఇలా అదిరిపోయే పోజ్ ఇచ్చారు. తన హాలీడే టూర్ లో భాగంగా కాజల్ అగర్వాల్ లండన్ కు వెళితే.. రకుల్ ప్రీత్ సింగ్ సినిమా షూటింగ్ లో భాగంగా అక్కడే ఉంది.

ఇద్దరూ అనుకోకుండా ఒకరికి ఒకరు తారసపడ్డంతో.. ఆ క్షణాన్ని ఇలా కెమేరాల్లో బంధించేసి.. జనాలకు చూపించేశారు. పరాయి దేశంలో తెలుగు సినిమా భామలు ఇంతటి క్లోజ్ నెస్ చూపించడం ప్రశంసించాల్సిందే.



Tags:    

Similar News