రకుల్ కు ఒక సినిమా వచ్చిందా??
గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతోన్న స్టార్ హీరోయిన్స్ లలో ముందుగా రకుల్ ప్రీత్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా గత ఏడాది రారొండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత ఊహించని ఫెయిల్యూర్స్ ని చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా స్పైడర్ సినిమా అమ్మడిని గట్టిదెబ్బే కొట్టింది. ఆ తరువాత వచ్చిన ఆఫర్స్ కూడా వెనక్కి వెళ్లాయి అని ఒక టాక్ వచ్చింది.
కానీ కోలీవుడ్ లో ఖాకి సినిమా తరువాత రకుల్ కెరీర్ ఊపందుకుంది. అలాగే బాలీవుడ్ స్క్రీన్ పై కూడా మెరవడం అమ్మడికి కలిసొచ్చింది. ఇక తెలుగులో అవకాశాలు రానట్లేనా అని అనుకుంటున్న సమయంలో బేబీకి మంచి అఫర్ దక్కింది. త్వరలో బాబీ దర్శకత్వంలో నాగ చైతన్య - వెంకటేష్ ఒక మల్టి స్టారర్ చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా లో రకుల్ నాగ చైతన్యకు జోడిగా నటించనుంది.
ఇంతకుముందు రారొండోయ్ వేడుక చూద్దాం సినిమాతో ఈ జంట సక్సెస్ అయ్యింది. దీంతో బాబీ మళ్లీ వారిద్దరిని ఒకటి చేయడానికి డిసైడ్ అయ్యాడు. మరి రకుల్ తెలుగులో ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు బాబీ బిజీగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉండవచ్చు. నాగ చైతన్య ప్రస్తుతం సవ్యసాచి ఎండింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.