• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రేమ.. పెళ్లిపై రకుల్‌...

ప్రేమ.. పెళ్లిపై రకుల్‌ ఫుల్‌ క్లారిటీ

By - Tupaki Desk
Update: 2021-11-22 11:30 GMT
సౌత్ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్ సింగ్ ఇటీవలే తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్లుగా పలువురి పేర్లు వినిపించాయి. కాని చివరకు షాకింగ్ గా ఈ అమ్మడు బాలీవుడ్ కు చెందిన జాకీ భగ్నానీ పేరు బయట పెట్టింది.

అతడితో ఈ అమ్మడి వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. వీరిద్దరు కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న నేపథ్యంలో ఇరు కుటుంబాలు కూడా అందుకు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం అందుతోంది. ఉన్నట్లుండి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రేమ వ్యవహారంను ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె పెళ్లి చేసుకునే రోజులు ఎంతో దూరం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో చిట్‌ చాట్‌ చేసింది. తన పెళ్లికి ఇంకా సమయం ఉందని.. తాను తన వివాహం విషయంలో పూర్తి పారదర్శకంగా ఉండాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతం. నా వ్యక్తిగత జీవితం గురించి బయట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది నా ఇష్టం. నా జీవితంకు సంబంధించిన మంచి విషయాలను అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను.

అదే నేను చేశానంటూ చెప్పుకొచ్చింది. ఒక సెలబ్రెటీ అంటే ప్రతి ఒక్కరు వారి జీవితాల గురించి ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అది నాకు కాస్త ఇబ్బంది కలిగించే విషయం. అయితే పబ్లిక్ ఫిగర్ గా ఉండటం నెగటివ్ అని తాను భావించడం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి పూర్తిగా కెరీర్‌ పై మాత్రమే దృష్టి పెట్టినట్లుగా చెప్పుకొచ్చిన రకుల్‌ త్వరలోనే పెళ్లి విషయంలో మరింత స్పష్టత ఇస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

రకుల్‌ ప్రీత్ సింగ్ గతంలో మాదిరిగా వరుసగా ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. ఆమె సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా చాలా బిజీగా ఉంటుంది. సౌత్‌ లో సినిమా ఆఫర్లు రాకపోవడంతో ఈ అమ్మడు ఉత్తరాదిన కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది.

స్టార్స్ తో సూపర్‌ స్టార్స్ తో సినిమాలు దక్కించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను కూడా చేసేందుకు సిద్దం అయ్యింది. రకుల్‌ ప్రీత్ సింగ్‌ మరి కొంత కాలం వరకు ఏదో ఒక ఆఫర్‌ అన్నట్లుగా కెరీర్‌ ను నెట్టుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ అమ్మడు పెళ్లి పీఠలు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    
  • Rakul 
  • ActressTollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS