• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిను వీడ‌ని నీడ‌ను నేను.....

నిను వీడ‌ని నీడ‌ను నేను.. ర‌కుల్ ప్రేమ గోల‌!

By - Tupaki Desk
Update: 2022-12-25 13:56 GMT
టాలీవుడ్ నుంచి నిష్కృమించాక ర‌కుల్ ప్రీత్ సింగ్ లైఫ్ జ‌ర్నీ గురించి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ భామ పూర్తిగా త‌న స్నేహితుడు జాకీ భ‌గ్నానీ కోసం స‌మ‌యం కేటాయిస్తోంది. అత‌డితో డేటింగ్ మ్యాట‌ర్ ఓపెనైన క్ష‌ణం నుంచి త‌న‌ని విడిచి దూరంగా ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. అన్నివేళ‌లా జాకీతో రోమాంచిత జీవితాన్ని ఆస్వాధిస్తోంది. ఈ జంట స‌హ‌జీవ‌నంపై ఇప్ప‌టికే బాలీవుడ్ మీడియా వ‌రుస క‌థ‌నాలు వండి వార్చింది. ఈ జంట విష‌యంలో ప్ర‌తిదీ బ‌హిరంగ‌మే.

ఈరోజు జాకీ భ‌గ్నానీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప‌లువురు టాప్ సెల‌బ్రిటీలు పార్టీకి అటెండ‌య్యారు. ఇదే పార్టీలో ర‌కుల్ వైట్ అండ్  సిల్వ‌ర్ క‌ల‌ర్ షార్ట్ ఫ్రాక్ లో మెరుపులు మెరిపించింది. ర‌కుల్ తాజా ఫోటోషూట్ తో పాటు మ‌రో అంద‌మైన ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్ లో ర‌కుల్ ఫ్లోర‌ల్ డిజైన్ ఫ్రాక్ లో క‌నిపించ‌గా వైట్ ష‌ర్ట్ లో జాకీని ల‌వ‌ర్ బోయ్ ని త‌ల‌పించాడు.

శాంటా నాకు అత్యుత్త‌మ కానుక‌ను అందించింది. ఈ జీవితానికి నువ్వే నా కానుక‌. హ్యాపీ బ‌ర్త్ డే మై ల‌వ్.. నా జీవితంలో ఆనందం ప్ర‌శాంత‌త‌ను నింపిన నా చెలికాడ‌వు. నేను సైలెంట్ అవ్వ‌డానికి కార‌కుడ‌వు నువ్వు. ఎల్ల‌పుడూ ఇలా చిరున‌వ్వుతో జీవ‌న మాధుర్యాన్ని ఆస్వాధించేందుకు కార‌కుడ‌వు! అంటూ జాకీపై ప్రేమ‌ను కురిపించింది.

ప్ర‌స్తుతం ర‌కుల్ జాకీ భగ్నానీ నిర్మిస్తున్న వ‌రుస చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. హిందీ ప‌రిశ్ర‌మ‌లో న‌టిగా నిర్మాత‌గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ జంట వివాహం జ‌ర‌గ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే దీనిపై ర‌కుల్ అధికారికంగా వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది.

ఏదీ దాచ‌ను.. పెళ్లిపై స్పందించిన ర‌కుల్

రకుల్ ప్రీత్ సింగ్ తాజా చిత్రం 'డాక్టర్ జి' శుక్రవారం నాడు థియేటర్లలోకి వచ్చింది. సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చినా ర‌కుల్ న‌ట‌న‌కు పేరొచ్చింది. ఈ చిత్రంలో తన నటనకు ప్రేక్షకుల నుండి ప్రేమ సందేశాలు ప్రశంసలను అందుకుంది. తన న‌ట‌న‌పై వస్తున్న సమీక్షలతో ర‌కుల్ ఆనందంలో ఉంది. తాజాగా త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో అదే విషయాన్ని వ్యక్తం చేసింది.

డాక్టర్ గా రకుల్ నిజాయితీగా నటించి మెప్పించింది. మొదటిసారి ఆయుష్మాన్ ఖురానాతో జంట‌గా న‌టించ‌డం ప్రేక్షకులు అభిమానులను మెప్పించింది. సోషల్ మీడియా ద్వారా రకుల్ తన అభిమానులకు విపరీతమైన ప్ర‌శంస‌లు కురిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ''ఆప్కే ప్యార్ సే హుమారా దిల్ ధక్ ధక్ కర్ రహా హై'' అని చెప్పింది. అనుభూతి కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జంగ్లీ పిక్చర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కింది. ఈ చిత్రంలో షెఫాలీ షా -షీబా చద్దా త‌దిత‌రులు న‌టించారు.

పెళ్లి వార్త‌ల‌పై స్పంద‌న ..

ఇటీవ‌లే ర‌కుల్ న‌టించిన‌ డాక్ట‌ర్ జి విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో త‌న పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల‌కు ర‌కుల్ స్పందించింది. గత ఏడాది నవంబర్ లో బాలీవుడ్ నటులు జాకీ భగ్నానీ- రకుల్ ప్రీత్ సింగ్ తమ సంబంధాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి ఈ జంట చాలా సందర్భాలలో కలిసి కనిపించింది. ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకుని జీవితంలో స్థిర‌ప‌డాల‌నుకుంటున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి.

ఈ వార్తలకు ప్రతిస్పందనగా రకుల్ ఒక ట్వీట్ ను పోస్ట్ చేసింది. ఇప్ప‌టికిప్పుడే తన పెళ్లి జరుగుతుందనే ఆలోచన త‌మ‌కు లేదని చమత్కరించింది. జాకీ -రకుల్ 2023లో వివాహం చేసుకోబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తన సోదరి వివాహ ప్రణాళికల గురించి ఇటీవ‌ల బ‌హిరంగంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ '''జాకీ భగ్నాని దర్శకత్వంలో రకుల్‌ రెండు సినిమాల్లో నటించింది. వివాహం స్పష్టంగా కార్డులపై ఉంది. కానీ ఇంకా ఏదీ తుది నిర్ణ‌యం తీసుకోలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె స్వయంగా ఆ విషయాన్ని ప్రకటిస్తుంది. అది జరుగుతుందో లేదో నాకు తెలుసు. ఏ సంబంధానికైనా వివాహం క్లైమాక్స్. జాకీ భారతీయ సినిమా అగ్ర నిర్మాతలలో ఒకరు. అతని మనస్సులో చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వాస్తవానికి వారిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి వారికి భారీ లక్ష్యాలు ఉన్నాయి'' అని తెలిపారు.

అతని వ్యాఖ్యల‌తో పుకార్లు ఊపందుకున్న తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ దానిపై స్పందించింది. తాజా ట్వీట్ లో త‌న సోద‌రుని ప్ర‌స్థావిస్తూ మీరు ధృవీకరించారా ? నా జీవితం పై ఎలాంటి వార్తలు లేవని సరదాగా ఉంది.. అని వ్యాఖ్యానించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే...

రకుల్ తదుపరి 'థ్యాంక్ గాడ్'లో నటించనుంది. ఈ చిత్రంలో పోలీస్ పాత్ర‌లో న‌టిస్తుంది. అజయ్ దేవగన్- సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో ఇత‌ర తారాగ‌ణం. 'ఛత్రివాలి' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా ఆమె నటించనుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • RakulPreetSingh 
  • Actress 
  • Bollywood 
  • JackieBhagnani 
  • CelebritiesParty 
  • Marriage 
  • DoctorG 
  • MovieNews 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS