స్టార్ హీరో నిర్మాతగా రాక్షసుడు హిందీ రీమేక్..!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది సినిమాలకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో తెలిసిందే. సౌత్ లో హిట్ అయ్యే ప్రతి సినిమాను హిందీలో రీమేక్ చేయాలనీ ప్రయత్నం చేస్తుంటారు బాలీవుడ్ మేకర్స్. ఆల్రెడీ హిందీలో రీమేక్ అవుతున్న టాలీవుడ్ మూవీస్ లిస్ట్ పెద్దగానే ఉంది. ఇప్పుడు అందులోకి మరో థ్రిల్లర్ మూవీ చేరినట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ చివరి బ్లాక్ బస్టర్ అయినటువంటి రాక్షసుడు సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతుంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమా హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తుంది.
స్వయంగా స్వీయనిర్మాణంలో అక్షయ్ రాక్షసుడు సినిమాలో నటిస్తాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి టాలీవుడ్ లో రాక్షసుడు సినిమాను హీరో హవీష్ ప్రొడ్యూస్ చేసాడు. అలాగే హిందీలో కూడా తానే ప్రొడ్యూస్ చేయనున్నట్లు ఇంతకాలం వెయిట్ చేసాడు. అలాగే హీరో అక్షయ్ కుమార్ తో కూడా చర్చలు జరిపి సినిమా సెట్ చేసుకున్నాడట. తీరా కరోనా కారణంగా సినిమాను ఆక్షయ్ కుమార్ కే అమ్మేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. రాక్షసుడు హిందీ రీమేక్ రైట్స్ కూడా మంచి ఫ్యాన్సీ రేట్ కే అమ్ముడు అయినట్లు టాక్. దాదాపు 2.7కోట్లకు సేల్ అయిందని సమాచారం.
2019 తెలుగు భాషలో రిలీజ్ అయిన రాక్షసుడు మూవీ సైకో థ్రిల్లర్ గా మంచి విజయం సాధించి భారీ వసూళ్లు కూడా రాబట్టుకుంది. రమేష్ వర్మ తెలుగులో డైరెక్ట్ చేసాడు. హిందీ రీమేక్ సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ నెల ఆఖరిలో లేదా వచ్చే నెల ప్రారంభంలో సినిమాను మొదలు పెట్టనున్నట్లు వినికిడి. అలాగే బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని.. సినిమాలో సైకో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. మరి ప్లాప్ లలో బెల్లంకొండ శ్రీనుని రాక్షసుడు సూపర్ హిట్ అందించి ఫామ్ లోకి తీసుకొచ్చింది. మరి ఈసారి అక్షయ్ కుమార్ కూడా హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.