• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ‌బ్బు, పేరు ప్ర‌ఖ్యాత‌లు...

డ‌బ్బు, పేరు ప్ర‌ఖ్యాత‌లు సంతోషాన్నివ్వ‌వు: ర‌జ‌నీ

By - Tupaki Desk
Update: 2017-10-28 10:15 GMT

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ - విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ల కాంబోలో ప్ర‌తిష్మాత్మ‌కంగా తెర‌కెక్కిన ‘రోబో 2.ఓ’ ఆడియో వేడుక నిన్న దుబాయ్ లో అట్ట‌హాసంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా త‌లైవా వేదాంత ధోర‌ణిలో ప్ర‌సంగించారు. దేవుడి ద‌య‌ - ప్ర‌జ‌ల ఆశీస్సుల వ‌ల్లే త‌న సినీ కెరీర్ ను ఆస్వాదించ‌గ‌లిగాన‌ని ర‌జ‌నీ అన్నారు. తాను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి నాలుగైదు రోజుల‌యిన‌ట్లుదని, త‌న న‌ట‌జీవితం చాలా త్వ‌ర‌గా గ‌డిచిపోయింద‌న్నారు. కెరీర్ ప్రారంభంలో డబ్బు - పేరు ప్రఖ్యాతులన్నీ కావాల‌నిపిస్తుంద‌ని, అయితే ఓ దశ దాటిన తర్వాత అవి ఎలాంటి సంతోన్ని  ఇవ్వవన్నారు. కానీ, అవి  లేకపోతే మ‌నం దురదృష్టంగా భావిస్తామ‌ని, ఆ విష‌యాన్ని తలచుకుంటే నవ్వొస్తోంద‌న్నారు. మంచి సినిమాలను - మంచి న‌టీనటులను ఎప్పుడూ ప్రోత్సహించాల‌ని  - సినిమాకు ఎలాంటి టాక్‌ వచ్చినా సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దని కోరారు.

ఈ వేడుక సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్ ను బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్ కొన్ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడిగారు. ప్రజల్లో అసహనం - ద్వేషం - అసూయ పెరగడానికి కారణం చెప్ప‌మ‌ని ర‌జ‌నీని క‌ర‌ణ్ ప్ర‌శ్నించారు. ప్రతీ ఒక్కరూ తమ స్వదేశాన్ని - భాషను ప్రేమిస్తార‌ని, వినయంగా, అణకువతో న‌డుచుకుంటేనే త‌న‌కిష్ట‌మ‌ని త‌లైవా అన్నారు. నేటి యువతరం సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోవ‌డం విచారకరమన్నారు. ఈ షో తెలుగు వెర్ష‌న్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాణా...ర‌జ‌నీని అభిమానుల కోసం తెలుగులో ఓ డైలాగ్ చెప్ప‌మ‌ని కోరారు. ర‌జ‌నీ తెలుగులో ఏది చెప్పినా అందంగా ఉంటుంద‌న్నారు. దీంతో, ర‌జ‌నీ ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ అంటూ బాషా సినిమాలోని  డైలాగ్ చెప్పారు. దీంతో ఆ వేదిక ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఈ వేడుక‌కు రజనీ సతీమణి లత - హీరో ధ‌నుష్‌ - కుమార్తెలు - సౌందర్య - ఐశ్వర్యలు పాల్గొన్నారు. త‌న‌ భర్తను చూస్తుంటే గర్వంగా ఉంద‌ని,  ‘2.ఓ’కోసం ఆయన ప‌డిన‌ శ్రమకు - చూపిన అంకితభావానికి నిజంగా సెల్యూట్‌ చేయాల‌ని ల‌త అన్నారు. ఈ చిత్రం కోసం ఎంతో శ్ర‌మించిన అమీ - రెహమాన్‌ - శంకర్‌ లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయటం వల్లే ఈ సినిమా  సాధ్యమైంద‌న్నారు.
Tags:    
  • Rajinikanth 
  • Robo 2.0 Audio Launch 
  • Telugu NEWs 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS